భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు బుల్లిష్ పై నడిచాయి. నిన్న నష్టాల పాలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ప్రారంభంలో భారీ నష్టాలు నమోదు చేసినా సాయంత్రానికి సెన్సెక్స్ దూసుకెళ్లింది. కీలక సూచీల మద్దతు లభించడంతో లాభాల్లోకి దూసుకుపోయాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 642 పాయింట్లు పెరిగింది. మొత్తం 49,585 వద్దకి చేరుకుంది. నిఫ్టీ 186 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 14,744 వద్ద స్థిరపడింది. రియాల్టీ, కన్జ్యూమర్ గూడ్స్ మినహా అన్ని సూచీలు ఈరోజు లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (4.47%),
ఎన్టీపీసీ (4.34%),
రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.50%),
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.44%),
అల్ట్రాటెక్ సిమెంట్ (2.54%).