నేషనల్ క్రష్ రష్మిక మందన్న పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆమె నటించే ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక తాజాగా సంచలన రికార్డు సృష్టించింది. గత రెండేళ్లలో మూడు సినిమాలతో ప్రేక్షకులు పలకరించిన రష్మిక.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 3,300 కోట్ల వసూళ్లను రాబట్టి బాలీవుడ్ అగ్రతారలనే హడలెత్తిస్తోంది. ఇండియన్ కొత్త బాక్సాఫీస్ క్వీన్ గా అవతరించింది.
2023 చివర్లో రష్మిక నుంచి `యానిమల్` మూవీ వచ్చింది. గత ఏడాది `పుష్ప 2: ది రూల్`తో పలకరించిన రష్మిక.. ఈ ఏడాది `ఛావా` మూవీలో మెరిసింది. మూడు చిత్రాల్లో మూడు విభిన్నమైన పాత్రలను పోషించింది. కట్ చేస్తే మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 3,300 కోట్లు రేంజ్లో కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. సౌత్ నుంచి నార్త్ కు వెళ్లిన హీరోయిన్లలో ఇంత వరకు ఎవ్వరు ఈ స్థాయి వసూళ్లు సాధించలేదు.
హిందీ వెర్షన్ చూసుకున్న కూడా.. యానిమల్, పుష్ప2, ఛావా మూడు సినిమాల టోటల్ కలెక్షన్స్ అక్షరాల రూ. 1850 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ఇప్పటికే బాలీవుడ్ లో దీపికా పడుకోణె అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆమె గత ఐదు చిత్రాల కలెక్షన్స్ రూ. 1800 కోట్లు. దీపికాను బీట్ చేసేందుకు కత్రినా కైఫ్, అలియా భట్, జాన్వీ కపూర్ వంటి వారు చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ సౌత్ నుంచి వెళ్లిన రష్మిక కేవలం రెండేళ్లలో మూడు చిత్రాలతో దీపికాను క్రిందకు నెట్టి టాప్ పొజిషన్ ను సునాయాసనంగా సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు రష్మిక పేరు మారుమోగిపోతోంది. కాగా, రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో `సికిందర్`, ధనుష్-నాగార్జున మల్టీస్టారర్ `కుభేర` చిత్రాల్లో నటిస్తోంది. వీటిల్లో సికిందర్ రంజాన్ కు రిలీజ్ కాబోతోంది.