బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల డేటింగ్ లో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ లో శ్రీలీలకు డెబ్యూ చిత్రమిది. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. సినిమా సంగతి పక్కన పెడితే.. హీరో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ చేస్తుందని బీటౌన్‌లో బలంగా టాక్ నడుస్తోంది.
ఇందుకు కారణం లేకపోలేదు.. కొద్ది రోజుల క్రితం కార్తీక్ ఆర్యన్ ఇంట ఓ ఫ్యామిలీ పార్టీ జరిగింది. ఈ పార్టీలో శ్రీలీల కూడా సందడి చేయడంతో డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. అలాగే తాజాగా ఐఫా అవార్డు వేడుకల్లో పాల్గొన కార్తీక్ ఆర్యన్ మదర్.. శ్రీలీలతో తన కొడుకు డేటింగ్ వ్యవహారంపై పరోక్షంగా హింట్ ఇచ్చారు. నిర్మాత కరణ్ జోహార్ ఐఫా వేడుకల్లో కార్తీక్ తల్లిని కాబోయే కోడలు గురించి ప్రశ్నించగా.. `ఒక మంది డాక్టర్ తమ ఇంటికి కోడలిగా రావాలని కోరుకుంటున్నాను` అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీలీల ప్రస్తుతం యాక్టింగ్ చేస్తూనే.. మరోవైపు మెడిసిన్ కూడా చదువుతోంది. దీంతో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ చేస్తున్నరన్న ప్రచారానికి హీరో మదర్ చేసిన కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. శ్రీలీలను ఉద్దేశించే కార్తీక్ తల్లి మాట్లాడారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో శ్రీలీల ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా, శ్రీలీల త్వరలోనే `రాబిన్‌హుడ్` మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కాబోతుంది.