`క` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న తాజా చిత్రం `దిల్ రూబా`. కిరణ్ కెరీర్ లో 10వ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్ డైరెక్టర్ కాగా.. రుక్సార్ ధిల్లన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం బ్యానర్లపై నిర్మించబడ్డ దిల్ రూబా మూవీ మార్చి 14న విడుదల కాబోతోంది. నేటి సాయంత్రం నుండే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు.
కిరణ్ గత చిత్రం క హిట్ నేపథ్యంలోనే దిల్ రూబా మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంది. క చిత్రానికి రూ. 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగితే.. దిల్ రూబా రూ. 11 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదరగొట్టింది. ఏపీ మరియు తెలంగాణలో రూ. 9 కోట్లు బిజినెస్ జరగగా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి రూ. 2 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దిల్ రూబా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లు.
అయితే దిల్ రూబా చిత్రానికి నో బజ్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. `క` కన్నా ముందే దిల్ రూబా చిత్రం స్టార్ట్ అయినప్పటికీ.. పలు కారణాల వల్ల విడుదల ఆలస్యం అయింది. పైగా ప్రమోషన్స్ ను అంతంత మాత్రంగానే చేశారు. గత సినిమాలతో పోలిస్తే దిల్ రూబా ను హీరో కిరణ్ అబ్బవరం ప్రమోట్ చేసింది చాలా తక్కువ. మరోవైపు థియేటర్స్ లో చిన్న చిన్న చిత్రాలన్ని వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ ఎగ్జామ్స్ టైమ్ కావడం వల్ల పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా సరైన ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోతున్నాయి. ఇటీవల విడుదలైన `మజాకా` మూవీ ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు దిల్ రూబా కూడా భారీ టార్గెట్ తో అన్ సీజన్ లోనే రిలీజ్ అవుతుంది. మరి ఈ చిత్రం ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.