హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తమిళ బ్లాక్ బస్టర్ `మాస్టర్` మూవీతో సౌత్ ఫిల్మ్ ఇండిస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మాళవిక మోహనన్.. ప్రస్తుతం తెలుగులో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న `రాజా సాబ్` మూవీలో ప్రభాస్ కు జోడిగా యాక్ట్ చేస్తోంది. మాళవిక యాక్ట్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కాగా.. మరోవైపు తమిళంలో `సర్ధార్ 2`, మలయాళంలో `హృదయపూర్వం` అనే సినిమాలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మాళవిక మోహనన్ ఎక్స్ వేదికగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ తరుణంలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరని ఒక నెటిజన్ అడగ్గా.. విరాట్ కోహ్లీ అని సమాధానం ఇచ్చిన మాళవిక. నిక్ నేమ్ గురించి ప్రశ్నించగా.. తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ మాలు అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఒక మీ ఫేవరెట్ హోబీ ఏంటని అడగ్గా.. తనకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని, అడవిలో ఉండటం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని మాళవిక తెలిపింది.
ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ ఒక అడుగు ముందుకేసి మాళవిక ఎదుట పెళ్లి ప్రపోజల్ పెట్టేశారు. `మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. మీరు కలలు కనే భర్తగా ఉండేందుకు ఏం చేయాలి?` అని సదరు అభిమాను ప్రశ్నించగా.. అందుకు మాళవిక అదిరిపోయే రిప్లై ఇచ్చింది. `ప్రస్తుతం నేను పెళ్లికి రెడీగా లేను.. ఇప్పట్లో నాకు ఎటువంటి భర్త అవసరం లేదు` అంటూ సదరు ఫ్యాన్ కు మాళవిక బదులిచ్చింది. దీంతో మాళవిక కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.