జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ఆదివారం మొదలవగా ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్దిని వైసీపీ ఫ్యాన్స్‌కు ఉరేశారని వ్యాఖ్యానించారు. వైసీపీ ఫ్యాన్‌కు ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. ఏపీ శ్రేయస్సు కోసమే టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని ఆయన స్పష్టం చేశారు.
జనసేన-టీడీపీ కూటమికి మద్దతు ఎందుకు ఇవ్వాలో పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వివరించారు. `ఏపీ అభివృద్ధిని.. 2019లో దేవుడనుకుని ఓట్లేశారు.. ఇప్పుడు దెయ్యమై పట్టుకున్నాడు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు అండగా ఉండాలి. ఈసారి తేడా జరిగితే 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతారు. ఏపీని పట్టి పీడిస్తోన్న వైసీపీ మహమ్మారికి జనసేన-టీడీపీ వ్యాక్సిన్ సరైన మందు. వైసీపీ గుర్తు ఫ్యాన్.. ఎవ్వరికీ అందదు.. ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లులు పేలతాయి. దాహం తీర్చే గ్లాసు.. ఓ చోటు నుంచి మరో చోటుకు చేర్చే సైకిల్ కలిశాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి` అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు.
టీడీపీ- జనసేన పొత్తుల గురించి సైతం పవన్ క్లారిటీ ఇచ్చారు. “జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వాలి. మళ్లీ జగన్‌కు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. కొందరికి ఈ పొత్తు వల్ల ఇబ్బంది పడొచ్చు.. కానీ అర్థం చేసుకోవాలని కోరుతున్నా. గతంలో టీడీపీ వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉండొచ్చు.. వారు ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. స్వయంగా తాను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే తన నిబద్జత ఏంటో అర్థం చేసుకోవాలలి. . నేనేం వెనక్కు వెళ్లను.. ఇక్కడే ఉంటాను. రామ- రావణ యుద్దం జరుగుతున్నప్పుడు నేను ఒక పక్షం వైపు ఉంటా. నాకు సీఎం సీటు కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యం` అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.