• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

భూమిలాంటి గ్రహం.. ఎంత దూరంలో అంటే?

admin by admin
April 18, 2025
in Around The World
0
0
SHARES
73
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్లమా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు మనిషి చేయని ప్రయత్నాలు లేవు.అయితే.. సాంకేతికంగా ఎంత ముందుకు వెళుతున్నప్పటికి.. ఈ అనంత విశ్వంలో జీవులు మనుగడ సాగించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్న దాని కోసం మనిషి పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందుకు తగ్గ కచ్ఛితమైన ఆధారాలు లభించలేదు. తాజాగా భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఒకరు సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఒక గ్రహం మీద జీవం ఉందన్న విషయాన్ని గుర్తించటమే కాదు.. తన వాదనకు బలమైన ఆధారాల్ని చూపిస్తున్నారు.

ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకుల టీం.. మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గ్రహాన్ని గుర్తించారు.దీని పేరు కే2-18బీ. మన భూమితో పోలిస్తే దాదాపు 8.5 రెట్లు పెద్దదిగా ఉండే ఈ గ్రహంలో కచ్ఛితంగా జీవం ఉందని చెబుతున్నారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహం మీద అనేక రకాల వాయువులు ఉన్నాయని కెమికల్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా గుర్తించారు. ఈ వాయువులు భూమిపైనా ఉండటమే తాజా పరిశోధనలో గుర్తించిన కొత్త అంశంగా చెప్పాలి.

ఈ వాయువులు జీవ సంబంధమైన ప్రక్రియ ద్వారానే ఉత్పత్తి అవుతాయని.. సముద్రంలోని ఆల్గేతో పాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. భూమిపై ఉన్నట్లు అక్కడ జీవించి ఉన్న ప్రాణాలు లేనప్పటికి జీవసంబంధిత ప్రక్రియలుజరుగుతున్నట్లుగా నిర్దారణకు వచ్చారు.అయితే..దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు.

జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పటానికి ఇది తొలి సంకేతంగా చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ లో అస్ట్రోఫిజిక్స్.. ఎక్సోప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు భారత సంతతికి చెందిన నిక్కు మధుసూదన్. ‘సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికి పరిశోధించే విషయంలో ఇదో కీలక మలుపు. ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని కచ్ఛితంగా చెప్పే రోజు కొన్ని సంవత్సరాల్లో వస్తుంది. మనం ఒంటరివాళ్లం కాదు’ అని ఆయన స్పష్టం చేస్తున్నారు.

కే2-18బీ గ్రహం సబ్ నెఫ్టూన్ తరగతికి చెందినదిగా చెబుతున్నారు. ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువగా.. నెఫ్ట్యూన్ వ్యాసం కంటే తక్కువగా ఉంటుంది. అయితే.. ఈ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. నిజానికి దీనిపై మిథేన్.. కార్బన్ డయాక్సైడ్.. డైమైథైల్ సల్ఫైడ్.. డైమైథెల్ డైసల్ఫెడ్ వాయువులు భారీగా ఉన్న విషయానని 2023లోనే గుర్తించారు. 1990 నుంచి ఇప్పటివరకు సౌర వ్యవస్థ బయట 5800 గ్రహాల్ని గుర్తించారు.

వీటిని ఎక్సో ప్లానెట్స్ గా పిలుస్తుంటారు. వీటిలోచాలా వరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నట్లుగా చెబుతారు. ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వందశాతం అస్కారం ఉందంటున్నారు. అయితే.. వాటిని గుర్తించటమే మిగిలి ఉందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిశోధనలు మరో స్థాయికి వెళ్లే అంశాల్ని గుర్తించటం ఖాయమంటున్నారు.

Tags: cambridge universityearthearth type planetfound
Previous Post

అల్లుడితో కలిసి బాలీవుడ్ నటుడి భారీ ల్యాండ్ డీల్

Next Post

సౌత్‌లోనూ నాకు గుడి క‌ట్టాలి.. ఊర్వ‌శీ వింత కోరిక..!

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Around The World

బే ఏరియాలో ఘనంగా ముగిసిన ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS)-2025!

May 15, 2025
Around The World

యుద్ధం వద్దు…కాళ్ల బేరానికొచ్చిన పాక్

May 10, 2025
Around The World

ఇండో-పాక్ ఉద్రిక్తలు..ఐపీఎల్ కు బ్రేక్

May 9, 2025
Around The World

భారత్.. పాక్ తీరుపై భిన్నంగా స్పందించిన జేడీ వాన్స్

May 9, 2025
Load More
Next Post

సౌత్‌లోనూ నాకు గుడి క‌ట్టాలి.. ఊర్వ‌శీ వింత కోరిక..!

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra