• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షాకింగ్‌.. బీజేపీలోకి సాయిరెడ్డి మంత‌నాలు షురూ!

admin by admin
April 17, 2025
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
72
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల‌కు షాకింగ్ లాంటి ప‌రిణామం. ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం కూడా. తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొం టున్నాన‌ని చెప్పిన వైసీపీ మాజీ నాయ‌కుడు, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాకం విజ‌య సాయిరెడ్డి.. క‌మ‌లం గూటికి చేరుతున్నార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం ఢిల్లీ స్థాయిలో మంత‌నాలు జ‌రుగుతున్న‌ట్టు కూడా తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీలో రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. ఇది ఒక‌ప్పుడు విజ‌యసాయిరెడ్డి సీటే కావ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీలో ఉండ‌గా.. ఆయ‌న రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఈ క్రమంలో 2022లో రెండో సారి పెద్ద‌ల స‌భ‌లోకి అడుగు పెట్టారు. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. అయితే.. పార్టీ ఓట‌మి.. త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గింద‌ని భావించిన సాయిరెడ్డిఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేశారు. అదేస‌మ‌యంలో త‌న రాజ్య‌స‌భ సీటును కూడా వ‌దులుకు న్నారు. అనంత‌రం.. ఆయ‌న బీజేపీలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అదేస‌మ‌యంలో సొంత‌గా పార్టీ పెడ‌తార‌ని.. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ద‌రి చేర్చుకుంటార‌ని కూడా ఓ చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

కానీ, ఆ చ‌ర్చ‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. సాయిరెడ్డి.. ఇక‌పై తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది లేద‌ని.. తాను త‌ట‌స్థంగానే ఉండిపోతా న‌ని చెప్పారు. అంతేకాదు.. త‌న‌పై రాసుకునే వారు ఏదైనా రాసుకోవ‌చ్చ‌ని.. కానీ, నా నిర్ణ‌యం మాత్రం మార‌బోద‌ని చెప్పారు. అయితే.. తాజాగా ఆయ‌న రాజీనామా చేసిన సీటు వ్య‌వ‌హారం తెర‌మీదికి రావ‌డం.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించ డం.. ఆ వెంట‌నే ఢిల్లీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం.. సాయిరెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నార‌న్న ప్ర‌చారం.. వంటివి ఆయ‌న తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న సంకేతాలు వ‌చ్చాయి.

ఇక‌, రాజ‌కీయాల్లో ఒట్టు-గ‌ట్టు గురించి అంద‌రికీ తెలిసిందే. అనేక మంది నాయ‌కులు రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించి కూడా.. ప‌ద‌వులు పొందిన వారు ఉన్నారు. కాబ‌ట్టి.. రాజ‌కీయ శ‌ప‌థాలు.. నేతిబీర చంద‌మే. ఈ ప‌రంప‌ర‌లో సాయిరెడ్డి మాత్రం ఎందుకు ప్ర‌త్యేకంగా ఉంటారు. ఏ ఎండ‌కు ఆ గొడుగు త‌ప్ప‌దు. సో.. ఇప్పుడు సాయిరెడ్డి తీసుకున్న నిర్ణ‌యం బీజేపీ అయితే.. త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. పైగా సాయిరెడ్డి వంటి బ‌ల‌మైన వ్య‌క్తి బీజేపీకి కూడా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఎన్నిక ప్ర‌క‌టించిన రాజ్య‌స‌భ సీటును బీజేపీకి కేటాయిస్తూ.. సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించార‌ని టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. ఇది కూడా.. సాయిరెడ్డి ఎంట్రీని బ‌ల‌ప‌రుస్తోంది.

Tags: central home minister amit shahex cm jagansaireddy may join bjpycp ex mp vijayasaireddy
Previous Post

కూట‌మి కంట్లో న‌లుసుగా మారిన బీజేపీ ఎమ్మెల్యే..!

Next Post

మోడీ రాక‌.. ఈ సారి భారీగానే అంచ‌నాలు ..!

Related Posts

Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Load More
Next Post

మోడీ రాక‌.. ఈ సారి భారీగానే అంచ‌నాలు ..!

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra