సోనియా గాంధీ డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇవ్వాలని పర్యటనలో TTD అధికారి గుర్తు చేయబోతే మహమేత అడ్డుపడి అదొక రాచ కుటుంబం‘‘ అని బిల్డప్ ఇచ్చి అడ్డుపడ్డాడు.ఈ విషయం ఎపుడో పదేళ్ళ క్రితమే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు. జగన్ డిక్లరేషన్ ఇవ్వడు. ఆయన అభిమాన జర్నలిస్టు సాయి చెప్పినట్టు జగన్ కి అహం అడ్డు వస్తుంది. డిక్లరేషన్ మీద సంతకం పెడితే సెక్యులరిజాన్ని అవమానించినట్టా గౌరవించినట్టా తలతిక్క లాజిక్ కాకపోతే.
విశ్వాసాల కేంద్రం అయినా గుడిలో సెక్యులరిజం ఏంటి..? బుద్ధి లేకపోతే ! పూరి జగన్నాథ్ ఆలయంలోకి ఇందిరనే రానివ్వలేదు. ప్రతీ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆచారాలు వ్యవహారాలు సంప్రదాయాలు ఉంటాయి. అలాగే క్షేత్ర పద్ధతులు కూడా ఉంటాయి. హిందువు అయినా అన్యమతస్తుడైనా వెళ్ళాలి అనుకుంటే సెక్యులర్ గా కాదు హిందువుగానే వెళ్ళాలి..
అన్యమతస్తుడైతే దైవం పట్ల విశ్వాసాన్ని ప్రకటించి డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. అది సీఎం అయినా వార్డు మెంబర్ అయినా సరే. TTD బోర్డు ముందు ఈ నియమం మాండటరీ చేయాలి అఫీషియల్ గా. అలాగే జన్మతః హిందువుగా పుట్టి హిందువుగా ఆచార వ్యవహారాలలో జీవిస్తున్న వారికి మాత్రమే పాలక మండలిలో స్ధానం కల్పించాలి. అవసరం అయితే బై లాస్ మార్చాలి.
నేను బైబిలు చదువుతా నా మతం మానవత్వం డిక్లరేషన్ పై సంతకం పెట్టను అంటే VIP హోదా పక్కన పెట్టి సామాన్యుడిలా ఉచిత దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు అపుడు డిక్లరేషన్ అవసరం ఉండదు. వేమారెడ్డి గారు చెప్పినట్లు ‘‘ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండ శుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ”