దేశంలో స్వలింగ సంపర్కరులు పెరుగుతున్నారని.. దీనికి గల కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే.. వైద్య రంగం రంగంలోకి దిగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదేసమయంలో స్వలింగ సంపర్కులను చులకనగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. స్వలింగ సంపర్కులకు సమాజంలోని సాధారణ పౌరులకు ఉండే అన్ని హక్కులు ఉంటాయని మరోసారి గుర్తు చేసింది. ఈ విషయంలో వారికి రాజ్యాంగం కూడా(ఆర్టికల్-14) అండగా ఉందని పేర్కొంది.
తాజాగా 20 మంది లెస్బియన్(స్వలింగ సంపర్క) జంటలు దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయ మూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తాము వివాహాలు చేసుకున్నామని, కానీ.. తమ వివాహాలను రిజిస్టర్ చేసేందుకు ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని.. సో.. తమ వివాహాలను రిజిస్టర్ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ.. వీరు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీనిని విచారించిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే హక్కు ఉందని పేర్కొన్న ధర్మాసనం.. వాటిని రిజిస్టర్ చేసేందుకు చట్టం అనుమతించబోదని.. పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నూతన చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో స్వలింగ సంపర్కుల వివాహాలను రిజిస్టర్ చేసేలా చట్టాలను చేయాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. చట్టం చేసే వరకు ఈ విషయంలో తాము కూడా ఏమీ చేయలేని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.