వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు మొదలు…అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, వంటి అంశాలతో కలియుగ దైవం వెంకన్న ఆలయ ప్రతిష్టను జగన్ సర్కార్ మసకబార్చింది.
ఇక, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం, టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటలు, కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం లేకపోవడం, క్యూలైన్లో ఉన్నవారికి సరైన సౌకర్యాలు లేకపోవడం, నాణ్యమైన భోజనం లేకపోవడం, కనీసం మంచినీళ్లు ఇవ్వకపోవడం వంటి వ్యవహారాలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలోనే జగన్ సర్కార్ ను జనం ఇంటికి పంపారు. ఇక, టీడీపీ హయాం మొదలుకావడం ఆలస్యం టీటీడీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ మొదలైంది. ఇక, అవసరమైన వారికి ప్రథమ చికిత్స అందించేలా ఫస్ట్ ఎయిడ్ ట్రాలీ తిరుగుతోంది.
సర్వదర్శనం సమయంలో విపరీతమైన రద్దీ ఉండడంతో భక్తులకు పులిహోర, మంచినీళ్లు అందిస్తున్న వీడియో వైరల్ గా మారింది. టీటీడీ ఈజ్ బ్యాక్..థ్యాంక్యూ బాస్ సీబీఎన్ భక్తులు సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://x.com/Prasadgaddipat9/status/1805450429666672653