ఒకప్పుడు లివర్ బాయ్ ఇమేజ్ తో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ గ్రాఫ్ ఆ తర్వాతి కాలంలో బాగా డౌన్ అయింది. వరస సినిమాలు చేస్తున్న కూడా ఆయనకు సక్సెస్ ఆమడ దూరంలోనే ఆగిపోతుంది. పైగా ఇటీవల కాలంలో సిద్ధార్థ్ కాంట్రవర్సీలకు కింగ్ గా మారాడు. ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పుష్ప 2 పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న నేషనల్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పుష్ప 2 మూవీతో టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది. అయితే అటువంటి చిత్రంపై సిద్ధార్థ్ తన అక్కసు వెళ్ళకక్కడం బన్నీ అభిమానుల ఆగ్రహానికి గురైంది.
సిద్ధార్థ్ నటించిన మిస్ యూ చిత్రం పుష్ప 2 కారణంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 13 కు వాయిదా పడిన విషయం విధితమే. ప్రస్తుతం సిద్ధార్థ్ తన సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే పాట్నాలో నిర్వహించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు లక్షల్లో జనాలు రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి..? అనే ప్రశ్న సిద్ధార్థ్ కు ఎదురైంది. అందుకు ఆయన సెటైరికల్ గా బదులిచ్చాడు.
`అదేమీ పెద్ద విషయం కాదు. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ కు తండోపతండాలుగా జనాలు రావడం ప్రమోషన్స్ జిమ్మిక్. ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. మన దేశంలో ఒక కన్స్ట్రక్షన్ దగ్గర జేసీబీ తవ్విన స్థలాన్ని చూసేందుకు కూడా జనాలు గుమికూడతారు. బిర్యానీ ప్యాకెట్, క్వాటర్ బాటిల్ ఇస్తామంటే పొలిటికల్ మీటింగ్స్ కు పరుగులు పెడుతుంటారు. భారీగా జనాలు వస్తేనే సక్సెస్ అనుకుంటే.. మీటింగ్స్ పెట్టిన పొలిటికల్ పార్టీలన్నీ గెలివాలి కదా? సో.. మన దేశంలో జనం గుమిగూడటం అనేది కామన్. అల్లు అర్జున్ ను చూడడానికి లక్షల్లో జనం పెద్ద విషయమే కాదు` అంటూ సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పట్ల బన్నీ అభిమానులు మరియు తెలుగు సినీ ప్రియులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. పుష్ప 2 పై ఎందుకంత అక్కసు సిద్ధార్థ్? అని ప్రశ్నిస్తున్నారు.