సెలబ్రిటీలు వేసుకునే దుస్తుల నుంచి వారు వాడే కార్ల వరకు అన్నింటి గురించి అభిమానులు ఎంతలా ఆరా తీస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధరించి ఒక షర్ట్‌పై ఫ్యాన్స్ కళ్లు పడ్డాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దుబాయ్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్.. భార్య, పిల్లలతో దుబాయ్ లో సేద తీరుతున్నారు. తాజాగా అక్కడ కొందరు ఫ్యాన్స్ ను ఎన్టీఆర్ మీట్ అయ్యారు. వారితో కలిపి ఫోటోలు కూడా దిగారు.
ఈ ఫోటోల్లో నీలిరంగు పూల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కూల్‌గా కనిపించారు ఎన్టీఆర్. అయితే అభిమానుల చూపంతా ఎన్టీఆర్ షర్ట్పైనే పడింది. ఆలస్యం చేయకుండా ఆ షర్ట్ గురించి ఆరా తీయగా.. అది `ఎట్రో` అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిందని తెలిసింది. ఇక చూడటానికి సింపుల్ గా ఉన్న కూడా ఎన్టీఆర్ ధరించిన షర్ట్ చాలా కాస్ట్లీ.. దాని ధర రూ. 85 వేల వరకు ఉంటుందని అంటున్నారు.
ఈ విషయం తెలిసి షాక్ అవ్వడం ఫ్యాన్స్ వంతైంది. ఒక్క షర్ట్ కోసం అంత ఖర్చు చేశారంటే ఎన్టీఆర్ రేంజ్ వేరె లెవల్ అంటూ అభిప్రాయపడుతున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో `వార్ 2` మూవీ చేస్తున్నాడు. అలాగే `దేవర 2`, ప్రశాంత్ నీల్ తో `డ్రాగన్` చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ మూవీ ఏప్రిల్ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని అంటున్నారు.