సీతారామం మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. తెలుగులో హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు తర్వాత ఇటీవల విడుదలైన కల్కి 2898 ఏడీలో మృణాల్ మెరిసింది. అయితే ఈ సినిమాలో ఆమె కేవలం అతిథి పాత్రలో నటించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలను పంచుకుంది. నటి కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని.. కానీ విధి తనను ఇండస్ట్రీ వైపు నడిపించిందని మృణాల్ పేర్కొంది. అలాగే సక్సెస్, ఫెల్యూర్ అనేది ప్రతి నటుడి జీవితంలో భాగం. కాబట్టి విజయాల గురించి పట్టించుకోను.. నటిగా ఎదగడానికి మాత్రమే నిరంతరం కృషి చేస్తానంటోంది మృణాల్.
ఇక ఇదే ఇంటర్వ్యూలో రొమాన్స్ గురించి మృణాల్ ఓపెన్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేసింది. `రొమాన్స్ అనేది చిన్న చిన్న హావభావాలు. అంటే మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడం, మనపట్ల ఎంతో కేర్ చూపించడం, మన ఆలోచనలో ఉండడం, మన కోసం చిన్న పనులను కూడా ప్రేమగా చేయడం నా దృష్టిలో గొప్ప రొమాంటిక్ చర్య` అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.