ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ గురించి పరిచయాలు అక్కర్లేదు. సౌత్ ఫిల్మ్ ఇండియాలో అగ్ర హీరోలతో ఆడిపాడిన ఖుష్బూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అత్త వంటి సహాయక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు పాలిటిక్స్ లోనూ సత్తా చాటుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. గత కొంత కాలం నుంచి ఖుష్బూ వెయిట్ లాస్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఖుష్బూ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా కూడా `బ్యాక్ టూ ది ఫ్యూచర్` క్యాప్షన్ తో ఖుష్బూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ పిక్స్ లో ఖుష్బూ మోడ్రన్ దుస్తుల్లో స్లిమ్‌గా, సూపర్ స్టైలిష్ గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత బొద్దుగా మారిపోయిన ఖుష్బూ.. 54 ఏళ్ల వయసులో బరువు తగ్గి నాజూగ్గా రూపాంతరం చెందడంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఖుష్బూ లుక్ పై నోరు పారేసుకుంటున్నారు.
స్లిమ్‌గా మారేందుకు ఇంజెక్షన్స్ తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ఒక నెటిజన్ `మౌంజారో ఇంజెక్షన్ మ్యాజిక్ ఇది. ఈ ఇంజెక్షన్స్ చేయించుకునే సన్నగా మారారు. ఈ విషయం మీ ఫాలోవర్స్ కు తెలిసి వాళ్లు కూడా ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలనే కదా` అంటూ కామెంట్ పెట్టారు. దాంతో చిర్రెత్తిపోయిన ఖుష్బూ సదరు నెటిజన్ కు తనదైన శైలిలో క్లాస్ పీకింది. `మీరు ఎలాంటి మనుషులు? మీరెప్పుడూ మీ ముఖాలను సోషల్ మీడియాలో పంచుకోరు. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు. మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తోంది` అంటూ ఖుష్బూ గట్టి కౌంటర్ ఇచ్చింది.
What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl
— KhushbuSundar (@khushsundar) April 15, 2025