టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం ‘చంద్రబాబు నాయుడు’ ఈ ఏడాది ఏప్రిల్ 20న 75వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఈ క్రమంలోనే ‘చంద్రబాబు’ జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కాలిఫోర్నియాలో ‘చంద్రబాబు’ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు.
శాన్ రామోన్ లోని స్పోర్ట్స్ పార్క్ లో జరగబోయే ఈ వేడుకలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
కాలిఫోర్నియాలోని టీడీపీ, ‘చంద్రబాబు’ అభిమానులందరినీ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి ‘చంద్రబాబు నాయుడు’ జన్మదిన వేడుకులను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరుపుకుందాం రండి అని నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు.
గత ఏడాది మాదిరిగా పిల్లలు, పెద్దలు అందరూ భారీగా ఈ వేడుకలకు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు.
‘చంద్రబాబు’ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కటింగ్ తో పాటు, వేడి వేడి స్నాక్స్, టీని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు.
ఏప్రిల్ 19న శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నారు.