ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సరికొత్త సుపరిపాలన ఇచ్చేందుకు రెడీ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
వచ్చేది తామే అని, ఏపీలో తమ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఢంకా బజాయించారు.
జనసేన యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించడం గమనార్హం. చాలా ముందుగానే పార్టీ మేనిఫెస్టోని కూడా ప్రకటించడం గమనార్హం.
జనసేన హామీల్లో ముఖ్యమైనవి
1 అప్పుల్లేనే ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం
2 రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విధానం
3 ఫ్రెండీ ఇన్వెస్టిమెంట్ సిస్టమ్
4 విశ్వనగరంగా విశాఖపట్నం, హైటెక్ సిటీలుగా విజయవాడ, తిరుపతి
5 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.
6 అన్ని వర్గాల ప్రజలు అమరావతిని ఆలవాలం చేస్తాం.
7 కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు.
8 తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి వారికి ఫ్రీ ఇసుక
9 యువతకు సులభ్ కాంప్లెక్స్ ఉద్యోగాలు కాకుండా.. స్వయం ఉపాధి ఏర్పాట్లు
10 ఉపాధి కోసం అర్హులైన వారికి రూ.10 లక్షలు సాయం
11 వ్యవసాయరంగాన్ని లాభసాటిగా చేయడం కోసం మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ పార్కుల ఏర్పాటు.
12 అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ
13 ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు అమలు
14 ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ.. సీపీఎస్ రద్దు
వైసీపీ కొమ్ములు విరుస్తాం
వైసీపీ నాయకుల కొమ్ములు విరుస్తాం. ఎన్నికల్లో గెలుస్తాం. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తే లేదని పొత్తులకు పవన్ హింటిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, అధికారం కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకుంటున్నారంటూ ప్రకటించారు.