అమెరికాలోని లాస్ వేగాస్ లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘ఐటీ సర్వ్ సినర్జీ 2024 సదస్సు’ విజయవంతంగా ముగిసింది. దాదాపు 2 వేల మంది హాజరై ఈ సదస్సును జయప్రదం చేశారు. ఐటీ సర్వ్ సభ్యులందరి సమిష్టి కృషితో ఈ సదస్సు ఇంతటి విజయం సాధించింది. అమెరికాకు వలస వచ్చి ఐటీ సంస్థలు స్థాపించిన, ఐటీ రంగంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారంతా ఐకమత్యంగా ఉండి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఐటీ సర్వ్ లక్ష్యం. 2010లో ఏర్పడిన న్యూఫెల్డ్ మెమో క్రైసిస్ సమయంలో ఐటీ సర్వ్ ఆలోచన పురుడుపోసుకుంది.
ఐటీ రంగంలో విజయవంతంగా కొనసాగేందుకు, తమ వాణిని గట్టిగా వినిపించేందుకు ఐటీ సర్వ్ అవసరం ఎంతైనా ఉంది. ఐకమత్యమే మహా బలం అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఐటీ సర్వ్ ఎక్కువ మంది సభ్యులను ఐటీ సర్వ్ లో చేర్చుకొని కలిసికట్టుగా ముందుకు సాగుతోంది. ఐటీ సర్వ్ సభ్యులందరూ ఒక్కతాటిపై సమిష్టిగా ముందుకు వెళితే మరిన్ని విజయాలు, లక్ష్యాలు సాధించగలం. సభ్యులందరూ తమకు అప్పగించిన బాధ్యతలను, అసైన్మెంట్లను సమర్థవంతంగా నిర్వహించడం, తమ అభిప్రాయలను, ఆలోచనలను స్వేచ్ఛగా వెల్లడించగలగడం, వాటిని గౌరవించడం ఐటీ సర్వ్ విజయ రహస్యం.
‘‘ఒక్కతాటిపైకి రావడం ఆరంభం, కలిసికట్టుగా ముందుకు వెళ్లడం అభివృద్ధి, సమిష్టిగా పనిచేయడం విజయం‘‘ అనే నినాదంతో ఐటీ సర్వ్ ముందుకు పోతోంది.
ఐటీ సర్వ్ సదస్సు విజయవంతం కావడానికి సభ్యులు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ సురేష్ పొట్లూరి, నేషనల్ ప్రెసిడెంట్ జగదీష్ మొసలి, గవర్నింగ్ బోర్డ్ చైర్ అమర్ వరధ, గవర్నింగ్ బోర్డ్ మెంబర్ & చైర్ గవర్న్ మెంట్ రిలేషన్స్ వినోద్ బాబు ఉప్పు, సీఎస్ఆర్ చైర్ సురేష్ మానుకొండ, సినర్జీ చైర్ రఘు, సెక్యూరిటీ…వర్మ&సామ్, హాస్పిటాలిటీ…బాబు గుర్రమ్, ప్రోగ్రామ్ ఫ్లో & కో డైరెక్టర్…అనిల్ ఆయతం, ఎంటర్ టైన్ మెంట్….సాంబ మొవ్వ, సురేష్ కందుల, లాజిస్టిక్స్… ప్రవీణ్ శ్యామల, రిజిస్ట్రేషన్…శివ ముపనార్, ఆల్ చాప్టర్ ప్రెసిడెంట్స్, ఆల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్, ఐటీ సర్వ్ మాజీ అధ్యక్షులు, ఐటీ సర్వ్ 2024 సినర్జీ బొర్డ్, ఐటీ సర్వ్ సభ్యులు, ముఖ్యంగా ప్రత్యూషా, బైటెగ్రాఫ్ ప్రొడక్షన్స్ లకు ధన్యవాదాలు.
ఐటీఎస్ఎస్ బోర్డ్ సభ్యులకు, సీఎస్ఆర్ బోర్డు సభ్యులకు, పీఏసీ, సీ-పీఎసీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. తమ అపూర్వ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రూప్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.
వినోద్ బాబు ఉప్పు
నేషనల్ ప్రెసిడెంట్ 2019
గవర్నింగ్ బోర్డ్ మెంబర్ 2024
సీఎస్ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ 2024