నేడు…
పెళ్లీడు వచ్చిన ప్రతి ఇద్దరు అమ్మాయిలో ఒకరు…. “పెళ్ళెందుకు? మా ఫ్రెండ్స్ ఆరు నెలలు తిరగకుండానే విడాకులు తీసుకొంటున్నారు . కాలం మారింది . మీ రోజుల్లో లా కలిసి మెలిసి ఉండడానికి, అడ్జస్ట్ కావడానికి ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరు . పెళ్లంటే జంటింగ్ హైలాండ్ కేసినో లో గ్యాంబ్లింగ్ ఆడడమే . రిస్క్ తో కూడుకొన్న వ్యవహారం . పెళ్లి చేసుకోకుండా బతకలేమా ? ” అంటున్నారు .
అమెరికా … కెనడా … మలేషియా , సింగపూర్ , చైనా … ఆస్ట్రేలియా … యూరోప్… ఇండియా ..
ఇస్లామిక్ దేశాలు ఆఫ్రికా తప్పించి ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ .
కారణం ?
గత ఎన్నో ఏళ్లుగా … పది , ఇంటర్ , నీట్ , క్లాట్ లాంటి ప్రవేశ పరీక్షలు, సివిల్స్ , గ్రూప్స్ .. అన్నింటా అమ్మాయిలదే పై చేయి .
బుద్ధిగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు , మంచి జీతాలు పొందుతున్నారు .
“షకలక బేబీ…” పాటలో చెప్పినట్టు అబ్బాయిలు అమ్మాయిల వెంట తిరుగుతుంటే… అమ్మాయిలు చదువు ఉద్యోగం సంపాదనలో పై చేయి సాధించారు .
” ఇంత చదువు చదివి , కస్టపడి ఉద్యోగం చేస్తూ… మగాడికంటే ఎక్కువ జీతం పొందుతూ… పెళ్లి పేరుతొ ఇంటిబానిస కావాలా? .. భర్త ఉద్యోగమే ప్రధానం అనుకొని అతని వెంట నడవాలా? ఆఫీస్ నుండి రాత్రి తొమ్మిదికి వచ్చి… కాలుపై కాలేసుకుని కూర్చొన్న భర్త కు సపర్యలు చెయ్యాలా ? పెళ్లి పేరుతొ వెట్టి అవసరమా ?”
ఇది నేడు సగటు యువతి ఆలోచన .
ఇది ఎక్కడికా పోతోందంటే అమ్మాయిలకు చదువు వద్దు అనే తాలిబన్ విధానం మంచిదే… అని కొంతమంది సనాతనులు ఆలోచించడం మొదలెట్టారు .
విద్య… వివాహ నాశనం .. ఇదే నేటి పరిస్థితి .
సామజిక తెలివితేటలు, పాజిటివ్ ఎమోషనల్ స్కిల్స్ నేర్పని చదువులు . కాలం మారినా ఇంకా మారను అనే కరుడు కట్టిన పితృస్వామ్య వ్యవస్థలు.
పెళ్లి చేసుకొన్నా పిల్లలు వద్దనుకునే వారి సంఖ్యపెరిగిపోతోంది .
సందుగొందులో సంతాన సాఫల్య కేంద్రాలు . పిల్లలు పుట్టడం గగనం అయిపోతోంది .
మరో పక్క పిల్లలు ఎందుకు? అనే వారి సంఖ్య పెరిగిపోతోంది .
పుట్టినప్పటినుంచి జనాభా నియంత్రణ గురించి మాత్రమే విన్న అధిక శాతం జనాలు ..” జనాభా తగ్గితే మంచిదే .. కాలుష్యం… వాహన రద్దీ తగ్గిపోతుంది” అనుకొంటున్నారు .
ఆఫ్రికా , ఇస్లామిక్ దేశాలు తప్పించి మిగతా దేశాల్లో జనాభా తగ్గడం ఇప్పటికే మొదలయ్యింది .
జపాన్, దక్షిణ కొరియా దేశాలను ఉదాహరణ గా తీసుకోవచ్చు .
దక్షిణ కొరియా ..
నలబై ఏళ్ళ క్రితం .. బీద దేశం .
చదువులు . ఉద్యోగాలు ..కష్టించే తత్త్వం .. వెరసి మెరుగైన ఆర్థిక వ్యవస్థ .. డబ్బున్న సమాజం అయ్యింది .
అతి సర్వత్రా వర్జయేత్ ..
బతకడం కోసం చదువు . ఉద్యోగం .. జీతం .
కానీ ఇప్పుడు దక్షిణ కొరియాల లో ఉద్యోగం కోసం బతికే వాళ్ళు ఎక్కువ .
పెళ్లిళ్లు పెటాకులు .
సియోల్ యువతులు పట్ఠాయ బాయ్స్ స్ట్రీట్ లో.. బాలి బీచుల్లో… కంబోడియా సీఎమ్ లో తమ శారీరిక వాంఛల్ని ఎదురు డబ్బిచ్చి తీర్చుకొంటున్నారు . ఈవీవీ జంబల కడి పంబ నేటి నిజం .
జపాన్ రుపాయి యెన్ .
దాని విలువ పడిపోతోంది .
ధరలు పెరుగుతున్నాయి .
ఎగుమతులు తగ్గుతున్నాయి . ముగ్గురిలో ఒకరు వృద్ధులు .
పని చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది .
ప్రజల కొనుగోలు శక్తి తగ్గే కొద్దీ ఉత్పత్తి తగ్గిపోతుంది . జపాన్ లో ఇదే జరుగుతోంది .
ఆదాయాలు తగ్గి… వ్యయాలు పెరిగి దేశం దివాళా దేశంగా అడుగులు వేస్తోంది .
ఆర్థికాంశాలు చాలామందికి ఒక పట్టాన అర్థం కావు .
మీకు అర్థం కావడానికి కొంత వివరణ .
హైదరాబాద్ ను ఒక ఉదాహరణ గా తీసుకొని వివరిస్తాను .
జనాభా తగ్గితే రియల్ ఎస్టేట్ , నిర్మాణ రంగం కుదేలవుతుంది . కొత్తగా… ఇళ్ల స్థలాలు… ఫ్లాట్స్… విల్లాలు కొనేవారు తగ్గిపోతారు . అంటే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బ తింటుంది .
దాని ప్రభావం భవన నిర్మాణ కార్మికుల పై పడుతుంది .
స్టీల్ , సిమెంట్ ఫ్యాక్టరీ లు మూతబడుతాయి .
లారీ లకు డిమాండ్ తగ్గిపోతుంది .
ఈ రంగాల్లో పని చేసే వారి కి ఉపాధి పోతుంది .
కొనుగోలు శక్తి తగ్గిపోతుంది .
దాని ప్రభావం టోల్ ఆదాయం . హోటల్స్ లాంటి వాటి పై పడుతుంది .
స్కూల్ బిజినెస్ బంగారు బాతు అనుకొని పెట్టుబడి దారులు ఇబ్బుడి ముబ్బిడిగా ముందుకొస్తున్నారు . ఇప్పటికే ఉండాల్సిందానికంటే రెండు మూడు రెట్లు అధిక శాతం స్కూల్స్ వున్నాయి . మరో పదేళ్లలో వీటిలో డెబ్భై శాతం పిల్లలు లేక మూత బడుతాయి . ప్రభుత్వ ప్రైవేట్ టీచర్స్.. డ్రైవర్స్ లాంటి వారి సంఖ్య తగ్గిపోతుంది .
ఇప్పటికే సాఫ్ట్ వెర్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక మాంద్యం ఏర్పడితే పరిస్థితి మరింత దారుణం అవుతుంది .
యువ జనాభా తగ్గడం అంటే పని చేసే వారి సంఖ్య తగ్గడం .. అంటే ప్రభుత్వ పన్నులు తగ్గడం .
వృద్ధుల సంఖ్య పెరగడం అంటే వ్యయం పెరగడం .
తలకిందులు పిరమిడ్ ఎంత కాలం నిలుస్తుంది ?
ఆర్థిక అస్థిరత… సామజిక అశాంతికి… రాజకీయ అస్థిరత కు దారి తీస్తుంది .
ఆడు మగాడ్రా బుజ్జి!
ట్రెంప్ వచ్చేసాడు .
వాక్ సీన్ లు తప్పని సరి అనే నియమాలకు ఇక చెల్లు చీటి!
అడ మగ.. రెండే లింగాలు అని తేల్చేసాడు .
ఎల్జీబీటీ ల హక్కులను గుర్తించడం వరకు న్యాయం . కానీ అతి చేసికొంటూ…. ” రెండా ? కాదు మొత్తం ఎనభై దాక జెండర్స్ వున్నాయి” అనడం .. పాఠశాల లోనే పిల్లలకు… ” ఆడామగా కానక్కరలేదు” అంటూ బ్రెయిన్ వాష్ చేసిన అల్ట్రా లిబెరల్స్ తమ గొయ్యి తాము తవ్వుకొన్నారు .
ట్రంప్ లాంటి నాయకులు రాబొయ్యే రోజుల్లో అనేక దేశాల్లో వస్తారు .
ట్రంపిజం !!
1 . పెళ్లి చేసుకోవడం తప్పని సరి . పెళ్లి చేసుకోని వారికి ఉద్యోగాల్లో కోత.. అధిక పన్నులు .
2 . విడాకులు తీసుకోవడం ఇప్పుడున్నంత ఈజీ కాబోదు . విడాకులు తీసుకొంటే ప్రభుత్వానికి ప్రత్యేక రుసుము చెల్లించాలి . శాలరీ లో ఇంత శాతం చొప్పున ప్రభుత్వానికి కట్టాలి . ఆ సెస్ ను పిల్లల సంక్షేమానికి ఉపయోగిస్తాము .
౩. పెళ్లి చేసుకున్నాక పిల్లలు వద్దనుకొంటే… వారి పై ప్రత్యేక సెస్. వారి ఆస్తుల్లో కొంత భాగం స్వాధీనం .
4 . పెళ్లి చేసుకున్న వారికి .. పిల్లలు కన్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత.
5 . బిడ్డ పుట్టడంతోటే వారి పేరుతొ ప్రభుత్వం నగదు జమ . పిల్లల పెంపకం కోసం నెల నెల ఇంత డబ్బు చొప్పున కేటాయింపు .
6 . పిల్లల సంఖ్య బట్టి ఉద్యోగాల్లో వారాంతపు సెలవులు .. ట్రావెల్ అలవెన్సు లు
ఇలా ఎన్నో కఠిన నిర్ణయాలు రానున్న రోజుల్లో వస్తాయి .
ఇలాంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి . నిజమే .
కానీ .. రంగుల రాట్నం పైకి పొతే కిందకు రాక తప్పదు కదా .
వివాహం కుటుంబం లేకుంటే సమాజం మనజాలదు . సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ట్రంప్ లాంటోడిని తెరపైకి తెస్తుంది .
శుభోదయం !