టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. కిరణ్ భార్య, ప్రముఖ హీరోయిన్ రహస్య గోరక్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఈ గుడ్‌న్యూస్ ను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. `మా ప్రేమ ఎదుగుతోంది` అనే క్యాప్షన్ తో తన వైఫ్ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఆనందకరమైన సమయంలో మీ అందరి ఆశీస్సులు తమకు ఉండాలని కిరణ్ ఆకాక్షించాడు. దీంతో కిరణ్-రహస్య దంపతులకు ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ కంగ్రాట్స్ చెతున్నారు.
2019లో వచ్చిన హిట్ మూవీ `రాజా వారు రాణి గారు`తో కిరణ్ అబ్బవరం, రహస్య హీరో-హీరోయిన్లుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా సమయంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. యాక్టింగ్ పై ఉన్న ప్యాషన్ తో బెంగళూరులో చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన కిరణ్.. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు.
తన తొలి సినిమా హీరోయిన్ అయిన రహస్యతో కొన్నేళ్లు ప్రేమాయణం నడిపిన కిరణ్ అబ్బవరం.. 2024 ఆగస్టులో ఆమెతోనే ఏడడుగులు వేశాడు. కర్ణాటకలోని కూర్గ్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా కిరణ్-రహస్యల వివాహం జరిగింది. ఇక 2025లో ఈ జంట పేరెంట్స్ గా కూడా ప్రమోట్ కాబోతోన్నారు. రహస్య విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ప్రొడెక్షన్ లో బిజీగా ఉంటోంది. కిరణ్ నుంచి ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ `క` మూవీ నిర్మాణంలోనూ రహస్య భాగమైంది.
View this post on Instagram