ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశ్వనాయకునిగా ఆవిష్కృతం అయ్యే క్రమంలో మరో ముందడుగు పడింది.
చంద్రబాబు నాయుడు పై తెలుగులో ప్రచురితం అయిన చంద్రబాబు x.o పుస్తకం తొలిసారిగా జర్మన్, ఫ్రెంచ్ భాషలలోకి అనువాదితం అయింది.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతున్న చంద్రబాబు సోమవారం జ్యూరిచ్ లో యూరోపియన్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని విదేశీ భాషలలోకి అనువాదితం అయిన చంద్రబాబు x.o పుస్తకాలను ఆవిష్కరించారు.
ఒక రాజకీయ నాయకునికి సంబందించిన పుస్తకం విదేశీ భాషలలోకి అనువాదితం కావటం, విదేశీ గడ్డపై ఆవిష్కృతం కావటం ఇదే తొలిసారి. ఆ ఘనత చంద్రబాబుకే దక్కింది.
తెలుగుజాతిని ప్రపంచంలోనే శక్తివంతమైనదిగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు మస్తిష్కంలో మెదిలే అనంత భావాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఎపి రెరా పూర్వ ఛైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి ప్రేరణతో గుంటూరు కు చెందిన సీనియర్ పాత్రికేయుడు, రేపటికోసం దినపత్రిక సంపాదకుడు డాక్టర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ తెలుగులో ఈ పుస్తకాన్ని రచించారు.
తెలుగులో ముద్రితమైన ఈ పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో బహులా ప్రజాదరణ పొందింది.
ఇంగ్లీష్, హిందీ భాషలలోనూ అనువాదితం అయిన ఈ పుస్తకం తాజాగా జర్మన్, ఫ్రెంచ్, భాషలలోకి తర్జుమా కావటం విశేషం.
ప్రవాసాంధ్ర ప్రముఖులు డాక్టర్ రవి వేమూరి సహకారంతో రావి రాధాకృష్ణ తో పాటు జర్మనీ కు చెందిన ఎన్ ఆర్ ఐ టిడిపి నాయక బృందం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ పుస్తకావిష్కరణ ఏర్పాటు చేయటం పట్ల ఎన్ ఆర్ ఐ తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నిర్వాహకులను అభినందించారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు రాష్ట్రమంత్రులు నారా లోకేష్, టిజి భరత్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు లు పాల్గొన్నారు.