ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ ఇద్దరి జోడీ ఇప్పుడు టీడీపీలోనే బెస్ట్ జోడీ.. బెస్ట్ కాంబినేషన్. గొట్టిపాటి సీనియర్ నాలుగుసార్లు ఎమ్మెల్యే.. ఏలూరి రెండుసార్లు ఎమ్మెల్యే. ఇద్దరూ ఇద్దరే.. నిత్యం ప్రజల్లో ఉండే మనుష్యులే. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్… పక్క పక్క నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు.. వచ్చే ఎన్నికల్లోనూ పరుచూరులో ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించే విషయంలో వైసీపీ వాళ్లకే పెద్ద డౌట్లు లేవు కాబట్టి… ఈ విషయంలో పక్కా క్లారిటీ..!
అయితే జగన్ తాజా ఈక్వేషన్ల దెబ్బతో వీరి గెలుపు మరింత ఈజీ చేయడంతో పాటు వీరి మధ్య చిన్నపాటి పోటీ పెట్టినట్టుగా కనిపిస్తోంది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల నుంచే పరుచూరులో ఏలూరిని, అద్దంకిలో గొట్టిపాటిని 2024 ఎన్నికల్లో ఎలా ఓడించాలా ? అని రకరకాల ప్లాన్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వేయడం మొదలు పెట్టాడు.. ఈ విషయంలో నో డౌట్. పరుచూరులో గత ఎన్నికలకు ముందు వరకు ఇన్చార్జ్గా ఉన్న రావి రామనాథం బాబును పక్కన పెట్టి ఏలూరిపైకి ఏకంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును పంపితే ఓడించి జగన్‌కే షాక్ ఇచ్చాడు.
ఇలా అయితే లాభం లేదని ఏలూరిని పక్కన పెట్టి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లిన రామనాథం బాబును తిరిగి తీసుకొచ్చి ఇన్‌చార్జ్‌ను చేస్తే పార్టీ గ్రాఫ్ సెంటిమీటర్ ముందుకు కదల్లేదు. ఎహే ఇలా లాభం లేదు.. క్యాస్ట్ ఈక్వేషన్‌తో కొడదాం అని చీరాలలో వర్గపోరు తీర్చడానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచిని తెచ్చి యేడాది పాటు ఇక్కడే ఉంచాడు. లాభం లేదు.. ఆమంచి ఎన్నికలకు ముందు చీరాలే కావాలి.. పర్చూరు వద్దన్నాడు.. ఇక ఇప్పుడు ఎవ్వరూ గతిలేక చీరాలలో 2014లో ఓడిపోయిన ఓ అవుట్ డేటెడ్ లీడర్‌గా ఉన్న యొడం బాలాజీ అని వైసీపీలోనే చాలా మందికి గుర్తులేని పేరున్న ఓ లీడర్‌ను తెచ్చి పెట్టాడు.
నో డౌట్.. చివర్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్పా ఏలూరిపై పరుచూరులో బాలాజీయే వైసీపీ క్యాండెట్ అవుతాడు. పరుచూరులో బాలాజీయే క్యాండెట్ అయితే ఏలూరి మెజార్టీ 35 – 40 వేల మధ్యలో ఉంటుందన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. బాలాజీ కనీసం కాపు, బలిజ ఓటర్లను కూడా ఆకట్టుకోలేరని అంటున్నారు. అదే టైంలో అటు అద్దంకిలో ఎక్కడో పల్నాడు జిల్లా నుంచి దిగుమతి అయిన హనిమిరెడ్డికి ఎన్నికలకు ముందే చుక్కలు కనపడుతున్నాయి. అద్దంకిలో బలమైన వర్గం ఉండి.. నిన్నటి వరకు వైసీపీ ఇన్చార్జ్గా ఉన్న బాచిన ఫ్యామిలీ సైకిల్ ఎక్కేసింది. అలాగే అక్కడ పట్టున్న కరణం వర్గం కూడా హనిమిరెడ్డికి సపోర్ట్ చేసే ఛాన్సులు లేవు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి ఎలాగూ బలమైన అనుచరగణం ఉంది.
ఇప్పుడు ఈ మూడు వర్గాలు కలిసిపోవడం… అటు హనిమిరెడ్డి నాన్ లోకల్ కావడంతో అద్దంకిలో రవి మెజార్టీ కూడా 40 వేలను టచ్ చేస్తుందనే లెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు పరుచూరులో ఏలూరి, ఇటు అద్దంకిలో రవి గెలుపుల కన్నా వీరికి వచ్చే భారీ మెజార్టీల మీద ఈ రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. టీడీపీ వాళ్లు సైతం మా అద్దంకిలోనే భారీ మెజార్టీ .. కాదు పరుచూరులోనే ఎక్కువ వస్తుందని చర్చించుకుంటోన్న పరిస్థితి అక్కడ ఉంది. మరి ఈ ఇద్దరు బెస్ట్‌ఫ్రెండ్స్ ల్లో ఎవరికి ఎక్కుడ మెజార్టీ వస్తుందో ? ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.