సినిమా ఆన్లైన్ టిక్కెట్ల అంశంపై నిన్న మెగాస్టార్ చిరంజీవి … ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య జరిగిన సమావేశం తర్వాత చిరంజీవి గురించి ఒక వార్త వైరల్ అయ్యింది.
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో ఒకటి చిరంజీవికి ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. చిరంజీవికి రాజ్యసభ సీటు హామీ ఇచ్చారనే ఊహాగానాలు బాగా ప్రచారం అయ్యాయి. ఈ వార్త వైరల్ కావడంతో చిరంజీవి స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు.
అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని చిరంజీవి కొట్టి పారేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నానని అన్నారు. నాకు ఎవరూ అలాంటి ఆఫర్ ఇవ్వ లేదని చిరు అన్నారు. నేను పదవి కోరుకోవడం లేదు కాబట్టి ఇకపై ఈ వార్తలపై నేను స్పందించను’ అని మెగా స్టార్ చిరంజీవి పేర్కొన్నారు.