బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లా పేరు ఎత్తితే మొదట వినిపించే పేరు ఈయనదే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాలనేని సమీప బంధువు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో, ఇప్పుడు వైసీపీలో బాలినేని కీలక నేతగా వివరించారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా 1999 నుండి 2014 వరకు ఐదు సార్లు వరుసగా గెలుపొందారు. 2019 శక్తి వనరులు, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖకు మంత్రిగా పనిచేశారు. అయితే మార్పులు చేర్పులు జరిగాక రెండోసారి ఆయనకు జగన్ పదవి ఇవ్వలేదు.
నాటి నుంచి బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి బాలినేనికి అడుగడుగునా అడ్డు పడుతుండడంతో ఇరువురు మధ్య పెద్ద రచ్చ జరిగింది. జగన్ క్లాస్ తీసుకున్న వారిలో మార్పు రాలేదు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 164 సీట్లను అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. కూటమి గెలుపు తర్వాత బాలినేని వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
కూటమి విపక్షాలైన టీడీపీ జనసేన బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కూటమి పార్టీలు మాత్రం బాలినేనికి నో ఎంట్రీ అంటూ మొండి చెయ్యి చూపిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అయినా కూడా బాలినేని ప్రజలకు చేసిందేమి లేదు. పైగా మంత్రిగా ఉన్నప్పుడు వందల కోట్లు విలువ చేసే మైనింగ్, భూ కబ్జాలు, దందాలు వంటి వ్యవహరాలతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నారు.
అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతూ ఇష్ట రాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజ్యాన్ని మూట పట్టుకున్నారు. ఇక ఇప్పుడు మైనింగ్, భూ కబ్జాలు, దందాలకు సంబంధించిన విచారణలు, కేసులు, అరెస్టుల నుండి తప్పించుకోవడం కోసం బాలినేని కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల జనసేనలో చేరేందుకు గట్టిగా ప్రయత్నించినప్పటికీ.. అటువైపు నుంచి ఆయనకు సానుకూల ఫలితాలు రాలేదు. ప్రకాశం జిల్లాలో అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిన బాలినేనిని పార్టీలో చేర్చుకునేందుకు కూటమి పక్షాలైన టీడీపీ జనసేన బీజేపీలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రస్తుతం బాలినేని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.