ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం, మహిళా రైడర్లను ప్రోత్సహిస్తూ, ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు.
అలాగే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చేనేత మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత ఉత్పత్తుల విక్రయం మరింత సులభం చేసేందుకు జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ చేనేత వస్త్రాల స్టాల్ ను ముఖ్యమంత్రి తన చేతుల మీదగా ఓపెన్ చేశారు.
అనంతరం ఆ స్టాల్ లో ఉన్న చేనేత కార్మికులతో ముచ్చటించిన చంద్రబాబు.. వారు తయారుచేసిన పంచె, కండువా, చీరల నాణ్యతను పరిశీలించారు. తన సతీమణి భువనేశ్వరి కోసం ఓ పట్టు చీరను కూడా కొనుగోలు చేశారు. ఈ చీరను ఎంతకు అమ్ముతున్నావమ్మా? అంటూ స్టాల్ లో ఉన్న మహిళను చంద్రబాబు ప్రశ్నించగా.. సదరు మహిళ రూ.26,400 సార్ అని చెప్పింది. వెంటనే చంద్రబాబు రూ. 25 వేలకు బేరమాడి చీరను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా, గతంలోనూ చేనేత కార్మికుల వద్ద భువనమ్మ కోసం చంద్రబాబు చీరలు కొనుగోలు చేశారు.
చేనేత మహిళలకు, చేనేత రథం అందించి, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా, ముందుగా జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఒక్క వ్యాన్ ఖరీదు రూ.60లక్షలు. దాని ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయం మరింత సులభం అవుతుంది. #KutamiStandsForWomen#WomensDay… pic.twitter.com/E8DEKqnDJG
— Telugu Desam Party (@JaiTDP) March 8, 2025