సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా ప్రజలు బయట కాలు కూడా పెట్టలేకపోయారు. మరోవైపు రైతులకు అధిక వర్షాలు కన్నీళ్లు మిగిల్చాయి. తీవ్ర పంట నష్టానికి కారణం అయ్యాయి.
రాష్ట్రాన్ని ఇటీవల కుదిపేసిన వర్షాలు, దాని వల్ల జరిగిన తీవ్ర పంటనష్టంపై వెంటనే చర్యలకు ఉపక్రమించాలని.. దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారాన్ని అందజేసే కార్యక్రమాన్ని యుద్దప్రాతిపదిక మీద చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ఇవాళ షర్మిల చంద్రబాబు నాయుడుగారికి లేఖ రాశారు.
ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాలు, వరదలతో రైతాంగం భారీగా నష్టపోయిందని.. అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పంట పొలాలు నీట మునిగాయని షర్మిల వివరించారు. రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలని షర్మిల కోరారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం చెల్లించాలని.. వెంటనే అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే కాలువల మరమ్మతులకు సంబంధించిన నిధులను గత వైకాపా ప్రభుత్వం దారిమళ్లించిదని షర్మిల మండిపడ్డాడు. వెంటనే కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభాత్వాన్ని షర్మిల కోరారు.
రాష్ట్రాన్ని ఇటీవల కుదిపేసిన వర్షాలు, దాని వలన జరిగిన తీవ్ర పంటనష్టం, వీటిపై వెంటనే చర్యలకు ఉపక్రమించి, దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారాన్ని అందజేసే కార్యక్రమాన్ని యుద్దప్రాతిపదిక మీద చేపట్టాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తరపున ఇవాళ నేను ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు… pic.twitter.com/kCVHh7psO3
— YS Sharmila (@realyssharmila) July 25, 2024