`ఒకే దేశం-ఒకే ఎన్నికలు` నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు జమిలి ఎన్నికలకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన కీలక అడుగు కూడా పడింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో జమిలి ఎన్నికలకు ఆమోదం తెలపడం ద్వారా.. తామ సర్వం సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపించింది. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా వైసీపీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఓకే చెప్పవచ్చు.
ఎందుకంటే మోడీపై ఉన్న భయంతోనో.. భక్తితోనో జమిలికి జై కొట్టవచ్చు. కానీ, ఎటొచ్చీ.. మోడీని వ్యతిరే కించే తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా విపక్షం బీజేడీ, బిహార్ విపక్షం ఆర్జేడీ, యూపీ విపక్షం ఎస్పీ వంటివి జమిలికి అంగీకరించే అవకాశం లేదు. సరే.. ఈ విషయం ఎలా ఉన్నా.. ఏపీ, తెలంగాణల విష యానికి వస్తే.. ప్రస్తుత ప్రభుత్వాలు జమిలికి ఓకేనా? అనేది ప్రశ్న. ఈ విషయంలో ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం అంగీకరించే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు కూడా జమిలికి ఓకే చెప్పనున్నారు. గతంలోనూ ఆయన జమిలి ఎన్నికలకు అనుకూ లమనే మాట్లాడారు. ఈ నేపథ్యంలోఆయన ఎలాంటి బేధాభిప్రాయం లేదు.పైగా ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీతో అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు ముందే అంగీకరించే అవకాశం ఉంది. అయితే.. ముందస్తుగానే ఎన్నికలు వస్తే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఉన్న 4 ఏళ్ల 9 నెలల కాలంలో ఎంత తగ్గిపోతుందనేది చూడాలి.
దీనికి అంగీకరించకపోవచ్చు. అంటే.. జమిలి పెట్టినా.. 2029 నుంచి పెట్టాలన్న డిమాండ్‌ను చంద్రబాబు లేవనెత్తే అవకాశం ఉంది. ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. రెండు కీలక పార్టీల్లో బీఆర్ ఎస్ జమిలికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక, అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం దూరంగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మోడీ ఎత్తుగడగానే చెబుతోంది. కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ ఈ జమిలికి సంబంధించిన నిర్ణయాలపై ఓకే చెప్పే అవకాశం లేదు.