2025 సంక్రాంతి పండుక్కి విడుదలైన తెలుగు చిత్రాల్లో `సంక్రాంతికి వస్తున్నాం` ఒకటి. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం.. తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు మూవీ బాగా కనెక్ట్ అయింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకీ ఎనర్జిటిక్ యాక్టింగ్ హైలెట్ గా నిలవడంతో.. ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలతో స్క్రీనింగ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రభాస్ యాక్ట్ చేసిన `బాహుబలి 2` రికార్డ్ ను బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వెంకీ మూవీ ఇప్పటి వరకు 13 రోజుల థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే బాహుబలి 2 విడుదలైన 13వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.68 కోట్లు కలెక్షన్స్ ను రాబట్టి అగ్రస్థానంలో ఉండగా.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఏకంగా రూ. 7.40 కోట్లు వసూల్ చేసి ప్రభాస్ మూవీని వెనక్కి నెట్టింది. 13వ రోజు హైయ్యెస్ట్ షేర్‌ను సొంతం చేసుకున్న చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.
ఇక 13 రోజల టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే.. ఏపీ మరియు తెలంగాణలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ. 115.61 కోట్ల షేర్, రూ. 186.20 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా 13 డేస్ లో రూ. 138.56 కోట్ల షేర్, రూ. 238.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42.50 కోట్లు కాగా.. వెంకీ ఈ టార్గెట్ ను ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేశాడు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ. 96.06 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఫుల్ స్టడీగా థియేటర్స్ లో రన్ అవుతోంది.