టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. సాయిపల్లవి తీరు మాత్రం కాస్త భిన్నం. చిట్టిపొట్టి బట్టలు వేసుకోవటం లాంటివి చేయకుండా.. ఘాటైన రొమాన్సు వరకు ఎందుకు.. సున్నితమైన ముద్దు పెట్టే సీన్లకు సైతం నో అనే కండీషన్ తో సినిమాలకు సైన్ చేస్తుంది. అలాంటి సాయి పల్లవి.. తాజాగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీలో హీరోను కిస్ చేసే సీన్ ఉంది.
అయితే.. దాన్ని ముద్దు అనే కన్నా.. ఏదో పెట్టాలి కాబట్టి తప్పక పెట్టినట్లుగా.. పెదాల్ని అలా రాసేసినట్లుగా ఉంటుందీ సీన్ లో. అయితే.. అసలు రీల్ లో తాను ముద్దు పెట్టలేదంటూ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది.
కరోనా 2 వేవ్ తర్వాత.. సరైన విజయం కోసం ఎంతో టెన్షన్ గా ఎదురుచూస్తున్న వేళ.. అందుకు తగ్గట్లే సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకుంది లవ్ స్టోరీ మూవీ. దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ తాజాగా నిర్వహిస్తున్నారు.
ఈ మూవీ మన దగ్గరే కాదు.. అమెరికాలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సాయిపల్లవి..సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ మూవీలో ఒక సందర్భంలో హీరో హీరోయిన్లు లిప్ లాక్ చేసుకునే సీన్ ఉంటుంది.
రోటీన్ కు భిన్నంగా సాయిపల్లవి ఎట్టకేలకు కిస్ సీన్ చేసిందన్న మాట అందరి నోట వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నమైన మాటల్నిచెప్పింది సాయిపల్లవి. తాను సదరు సీన్ లో నాగ చైతన్యను నిజంగా ముద్దు పెట్టుకోలేదని.. కెమెరామెన్ ఆ సీన్ ను నిజం అనిపించేలా కెమెరా యాంగిల్ పెట్టి సెట్ చేసినట్లుగా అసలు విషయాన్ని వెల్లడించారు.
తాను ముద్దు సీన్లు చేయనని సినిమాను ఒప్పుకునే ముందే చెప్పేశానని.. అలానే సినిమాలో ముద్దు సీన్ చేయాలంటూ దర్శకుడు శేఖర్ కమ్ముల తనను ఒత్తిడి చేయలేదన్నారు. తనను ఇబ్బంది పెట్టలేదన్నారు.
మొత్తంగా సాయి పల్లవి ఎప్పటిలానే తన కండీషన్ ను కంటిన్యూ చేసిందే తప్పించి.. ముద్దు సీన్ చేయలేదన్న విషయాన్ని తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేసిందని చెప్పాలి.