ఇదొక అనూహ్య చర్చ. ఇప్పటి వరకు అసలు మచ్చుకైనా.. ఏపీ రాజకీయాల్లో కనిపించని.. వినిపించని పేరు రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్‌గా ఏపీలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అనేక సినిమాల ద్వారా ఏపీ ప్రజల ఆరాధ్య నటుడు అయ్యారు. అయితే.. అనూహ్యంగా విజయవాడ శివారులో కొన్ని రోజుల కిందట టీడీపీ నిర్వహించిన అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ వేడుకలకు రజనీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును , ఎన్టీఆర్‌ను పొడిగారు.
అయితే.. దీనిపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వివాదంలో తాను తలదూర్చనని.. ఎవరి మానాన వారు కామెంట్లు చేసుకుంటూ.. పోతే.. వివాదం పెరుగుతుందని.. రజనీ కొంత లౌక్యంగా మాట్లాడి సర్దు బాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే.. మనోళ్లు ఊరుకుంటారా? ఇక్కడే ఆయనను వాడేసుకుంటున్నారు.
టీడీపీ నేతలు.. రజనీ ప్రభావం ఎక్కువగా ఉన్న చిత్తూరులో ఆయన ఫొటోలకు పాలాభిషేకం చేసి.. వైసీపీ చేసిన విమర్శలు పోవాలంటూ దిష్టి తీశారు. ఇక, ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా రజనీ బొమ్మల ను దిష్టి బొమ్మలుగా రైతులకు పంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు సాగకపోయినా.. రజనీ ప్రభావం ఉంటుందని భావిస్తున్న నగరి, పుత్తూరు, కుప్పం, చిత్తూరు పార్లమెంటు పరిధిలోని దాదాపు ఐదు నియోజకవర్గాల్లో రెండు పార్టీలూ తలపడుతున్నాయి.
మరి రజనీ విషయాన్ని చూస్తే.. ఈ ఐదు నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రభావం ఉంటుందని టీడీపీ నమ్ముతోంది. రజనీని తిట్టడం ద్వారా ఈ జిల్లాలో వైసీపీ చాలా నష్టపోయిందని టీడీపీ నమ్ముతోంది. నగరిలో ఇంకా తీవ్రంగా ఉంటుందని… టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఇక్కడ రోజా పై ఇప్పటికే వ్యతిరేకత ఉంది. ఇక రజనీ ఆయుధాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు. ఇక్కడ సుమారు 40 వేల వరకు తమిళ తెలుగు ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు ఇప్పటి వరకు రోజాకు పడుతున్నాయి. వీరిని తమవైపు తిప్పుకోవాలని టీడీపీభావిస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.
మొత్తానికి చిత్తూరులో రజనీ ప్రభావం ఎక్కువ. ఇక్కడ జగన్ కు అనకూలంగా ఉండేవారు ఓటర్లు. ఇపుడు జగన్ కి భారీ నష్టం తప్పదంటున్నారు. ఒకవైపు పాలన ఫెయిల్, మరో వైపు రజనీ అభిమానుల ఆగ్రహానికి గురికావడమూ ఒక కారణం.