పసుపు పరవళ్ళతో పరవశించిన ఒంగోలు.#Mahanadu2022 pic.twitter.com/rlzvbj2qdR
— Telugu Desam Party (@JaiTDP) May 28, 2022
క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది ప్రజలు ఇదే కోరుకుంటున్నారని అన్నారు. “రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు ముందుకు వచ్చారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ప్రజలు సభకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడమే కాదు.. కారు టైర్లలో గాలి తీశారు. అయినా.. టీడీపీ వెంట ప్రజలు ఉన్నారు.. వైసీపీ వెంట బస్సులు ఉన్నాయి. అదుపు తప్పితే పోలీసులనూ నియంత్రించే శక్తి తెలుగు సైన్యానికి ఉంది“ అని బాబు హెచ్చరించారు.
ప్రజలకోసం పోరాడుతాంమని చెప్పారు. కొండనైనా బద్దలు కొట్టే శక్తి తెలుగుదేశం శ్రేణులదని అన్నారు. “ఈరోజు జగన్కు నిద్రరాదు. బస్సు యాత్ర పెడితే నమ్ముతారనుకున్నారు. బాదుడే బాదుడుకు పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని నిర్వహించారు. గడప గడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. వాళ్ల మీటింగ్లు వెల వెల.. మన మీటింగ్ కళ కళ“ అని చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
మహానాడుకు వచ్చిన ప్రజా వెల్లువ చూసారా! ఈ జన సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం తధ్యం.#Mahanadu2022 pic.twitter.com/IPoKn1yO4p
— Telugu Desam Party (@JaiTDP) May 28, 2022
సోషల్ మీడియానే ఆయుధం..
వైసీపీ సర్కారు అరాచకాలను యువత ఎండగట్టాలని, అందుకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మీడియాను కూడా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్న బాబు.. ఫోన్ ద్వారానే వారి సర్కారు బండారం బయటపెట్టాలని సూచించారు. తాను తీసుకొచ్చిన సంస్కరణల ద్వారానే అందరి చేతిలో సెల్ఫోన్ ఉందని, సెల్ఫోన్ ద్వారా సామాజిక ఉద్యమం చేపట్టి, జగన్ ప్రభుత్వానికి ఉరేసి బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.
ఎన్టీఆర్ అశయాలను సాధిస్తాం..
శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఆశయాలను నెమరువేసుకోవాలని బాబు అన్నారు. భవిష్యత్లో కూడా ఎన్టీఆర్ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని అన్నారు. ఆయన శతజయంతి సందర్భంగా.. ఈ ఏడాదంతా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టి, ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో మహానాడు పెడతామని, వైసీపీ అవినీతిని ఎండగడుతూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
జగన్ ను ఇంటికి పంపాలని జనం చూస్తున్నారు..
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాల్సిందేనని బాబు పిలుపునిచ్చారు. త్వరగా జగన్ను ఇంటికి పంపాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు ముందుకు వచ్చారని అన్నారు. ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారన్న బాబు.. వారి కోరిక త్వరలోనే తీరుతుందన్నారు. కాగా.. రెండు రోజుల మహానాడు.. శనివారం పూర్తయింది.