యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `దేవర`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్ అయిన దేవర.. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
అయినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాడు. అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దేవర మూవీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇండియా వైడ్ గా డే 1 ఈ చిత్రం ఏకంగా రూ. 77 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ను రాబట్టింది ట్రేడ్ వర్గాలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలుగులో రూ.68.6 కోట్లు, హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ. 30 లక్షలు, తమిళంలో రూ. 80 లక్షలు, మళయాళంలో రూ. 30 లక్షలు చొప్పున దేవర వసూల్ చేసింది.
అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలో త్రిబుల్ ఆర్ అగ్రస్థానంలో ఉండగా.. దేవర రెండో స్థానాన్ని కైవశం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా దేవర పార్ట్ 1 కు మొదటి రోజు ఏకంగా రూ. 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇదే జోరు చూపిస్తే వారం రోజుల్లో దేవర బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.