టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో అక్కినేని మన్మధుడు నాగార్జున ఒకరు. ఏఎన్ఆర్ గారి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన ప్రతిభతో నాగార్జున ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్తూ నటుడిగా, నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్నారు. అటువంటి నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఓ అభిమానికి క్షమాపణ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేరుగా తమ అభిమాన తారలను చూసినప్పుడు ఫ్యాన్స్ లో వచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు. వారితో మాట్లాడాలని, ఫోటో దిగాలని తెగ ఉత్సాహం చూపుతుంటారు. అయితే ఒక్కోసారి సెక్యూరిటీ సిబ్బంది అభిమానులకు అడ్డుపడి నిరుత్సాహ పరుస్తుంటారు. కొన్నిసార్లు తోపులాటలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా నాగార్జున విషయంలోనూ ఇదే జరిగింది. కుబేర మూవీ షూటింగ్ కోసం హీరో ధనుష్ తో కలిసి నాగార్జున ముంబై వెళ్లారు.
అయితే ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఓ అభిమాని నాగార్జునతో ఫోటో దిగేందుకు పరుగులు పెట్టాడు. అయితే నాగార్జున పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు సదరు అభిమానిని తోసి పడేశాడు. చాలా వేగంగా వెనక్కి నెట్టడంతో సదరు అభిమాని కింద పడిపోయాడు. నాగార్జున ఈ విషయాన్ని గ్రహించలేదు. కానీ అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నాగార్జున ట్రోలింగ్ కి బారిన పడ్డారు. మీ మానవత్వం ఎక్కడికెళ్ళింది అంటూ చాలామంది ఆయన్ను విమర్శించారు.
దాంతో నాగార్జున ఈ విషయంపై స్పందించారు. తన తప్పు లేకపోయినా నాగ్ ఎంతో హుందాగా క్షమాపణలు చెప్పారు. `ఇది నా దృష్టికి వచ్చింది… ఇలా జరగకూడదు. నేను అతనికి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను` అంటూ నాగార్జున హమీ ఇచ్చారు. దీంతో ఆయన ట్వీట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా, కుబేరా విషయానికి వస్తే.. శేఖర్ కమ్మలు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఇది. ధనుష్ హీరోగా.. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ ఎంపిక అయింది.
This just came to my notice … this shouldn’t have happened!!
I apologise to the gentlemanand will take necessary precautions that it will not happen in the future !! https://t.co/d8bsIgxfI8
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 23, 2024