టాలీవుడ్ లోని యంగ్ హీరోలలో నాగశౌర్యకు ఒక ప్రత్యేకత ఉంది. విభిన్న కథలను ఎంచుకునే విలక్షణ కథానాయకుడిగా నాగశౌర్య గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల కృష్ణ విృంద విహారితో హిట్ కొట్టిన నాగశౌర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నాగశౌర్యకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడు.
చాలాకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నప్పటికీ ఇటీవలే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించడంతో లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. అయితే, నాగశౌర్య ఎంత కట్నం తీసుకోబోతున్నాడు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 40 నుంచి 50 కోట్లు కట్నం ఇచ్చారని నెటిజన్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.
అంతేకాదు, అనూష పేరు మీద కూడా కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, వాటిలో కూడా చాలా వాటిని నాగ శౌర్య పేరు మీద రాశారని టాక్ వస్తోంది. అయితే, ఇది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి కట్నం ఏది తీసుకోలేదని మరికొందరు అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఈ విషయాలపై అధికారికంగా ఇరు కుటుంబాల వారు క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ పుకార్లు పుకార్లగానే మిగిలిపోక తప్పదు.