తెలుగు సినిమాకు తొలి గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. పేరు కొత్తగా అనిపించొచ్చు. అదే కె.విశ్వనాథ్ అన్నంతనే ఇట్టే గుర్తుకు వస్తారు. ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఆయన తీసిన ఒక శంకరాభరణం.. ఒక సిరిసిరి మువ్వ.. ఒక సిరివెన్నెల.. ఒక స్వాతిముత్యం.. ఒక శుభసంకల్పం.. సినిమా ఏదైనా చెరగని ముద్ర వేసి.. తరాలకు తరాలకు తెలుగు సినిమా అసలు రూపం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసిన దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్. విలువల పాఠాల్ని తన పాత్రల చేత చెప్పించే ఆయన.. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కళ్లుమూశారు.
92 ఏళ్ల కళాతపస్వి శాశ్విత నిద్రలోకి జారుకున్నారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పటిలానే ఆయన కోలుకొని మళ్లీ ఇంటికి తిరిగి వస్తారని ఆశించిన దానికి బిన్నంగా.. ఆయన ఈసారి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
దీంతో.. సినీ అభిమానులు.. కళాభిమానులు.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాదు.. సినిమాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు విషాదంలో మునిగిపోయారు. గురువారం రాత్రి 12 గంటల వేళలో ఆయన భౌతికకాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి సొంతింటికి చేర్చారు.
కె.విశ్వనాథ్ విషయానికి వస్తే ఆయన సొంతూరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దపులివర్రు గ్రామం. అక్కడ జన్మించిన ఆయన తన సినీ ప్రస్థానంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చేయటం.. కొన్నేళ్లుగా ఫిలింనగర్ లో నివాసం ఉండటం తెలిసిందే. ఆయనకు భార్య.. ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె ఉన్నారు. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్ మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు.
Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam
Only Telugu movie has ever been selected to represent India at #Oscars until now.#kvishwanath #RipLegendpic.twitter.com/CIwa2saNzt
— Naveen Gupta ???? (@Naveen_Guptaa) February 2, 2023
We Miss you #vishwanath garu ????
You'll be remembered
My favorite scene from his movie's#RipLegend #kvishwanath pic.twitter.com/nYulT0hY22— CH Ravikumar ???? (@ChimliRavikumar) February 2, 2023