గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఎంత సంచలనం అవుతుందో అందరూ చూస్తున్నాం.
ప్రేమోన్మాది చేతిలో బలైన ఆమె పట్ల అందరూ న్యాయం కోసం అడుగుతున్నారు.
ప్రభుత్వం మాత్రం రమ్యకు రమ్య వంటి ఆడపిల్లలకు న్యాయం చేయకుండా రమ్య కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నించి చేతులు దులుపుకుంది.
తెలంగాణలో ప్రియాంక రెడ్డి దుండుగులు అఘాయిత్యం చేసి చంపేస్తే సొంత సామాజిక వర్గం కాబట్టి ఎన్ కౌంటర్ ని సమర్థించి కేసీఆర్ కు జగన్ ఆనాడు హ్యాట్సాఫ్ చెప్పారు.
కానీ ఏపీలో తన ఇంటికి దగ్గర్లో మరో ఆడబిడ్డకు అలాంటి అన్యాయమే జరిగితే నిందితులను శిక్షించడంలో అలసత్వం చూపుతున్నారు.
చట్ట రూపం దాల్చని దిశ చట్టంతో ఏపీలో ప్రజలను ఏపీసర్కారు తప్పుదోవ పట్టిస్తోంది.
రమ్య మరణంతో అయినా దిశ గుట్టు రట్టు కావాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీలో జగన్ 21 రోజుల్లో ఆడపిల్లకు అన్యాయం చేసిన ఉరితీస్తాం అన్నారు.
ఇపుడు లోకేష్ అదే డెడ్ లైన్ పెట్టారు. దీంతో సర్కారు వణికిపోయి రమ్య ఇంటి సభ్యులకు స్థలం, ఉద్యోగం, డబ్బులు ఇచ్చారు. కానీ లోకేష్ అడిగింది రమ్యకు న్యాయం చేయమని… కానీ వైసీపీ సర్కారు రమ్య కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం చేసింది.
దీనిపై లోకేష్ తాజాగా స్పందించారు.
21 రోజుల్లోగా రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే మళ్లీ ఇక్కడికి వస్తామన్నారు.
తాను విధించిన డెడ్ లైన్ కు ఇంకా 14 రోజులే మిగిలున్నాయని స్పష్టం చేశారు.
విద్యావంతురాలైన రమ్యని హత్యచేసిన వాడికి ఉరి ఎప్పుడు? అని ప్రశ్నించారు.
రమ్యకు న్యాయం చేయకుండా ఈ సమస్య తెరపైకి రాకుండా ఉండేందుకు తనపై ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని ఉసిగొల్పుతున్నారని లోకేశ్ ఆరోపించారు. ఇదే శ్రద్ధ మహిళల రక్షణ కోసం చూపించమని సీఎం జగన్ ను ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కన బెట్టి మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని లోకేశ్ హితవు పలికారు. మరే ఆడపిల్లకు అన్యాయం జరగకుండా రమ్యకు న్యాయం చెప్పి లోకానికి సందేశం ఇవ్వాలన్నారు.
ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని నామీదకి ఉసిగొల్పడానికి పడ్డ శ్రమ మహిళల రక్షణ కోసం పెట్టి ఉంటే మీ పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు @ysjagan గారు. ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపు పక్కన పెట్టి మహిళల భద్రత పై దృష్టి పెట్టాలి.(1/2)#JusticeForRamya pic.twitter.com/T59vVF0noG
— Lokesh Nara (@naralokesh) August 22, 2021