ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు `దేవర` రూపంలో మరో బిగ్ హిట్ వచ్చి పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా.. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన దేవరకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.
కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దేవర టాప్ లేపేసింది. ఎన్టీఆర్ ఇంటెన్స్ యాక్షన్, రెండు పాత్రల్లో ఆయన యాక్టింగ్ వేరియేషన్, సాంగ్స్, విజువల్స్ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. పైగా దసరా హాలిడేస్ కూడా కలిసి రావడంతో దేవర కాసుల వర్షం కురిపించింది. రీసెంట్ గా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి అదిరిపోయే మైల్స్టోన్ ను అందుకుంది.
ఇక ఇప్పుడు దేవర ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అన్ని భాషల ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ రూ. 155 కోట్లు చెల్లించింది. అయితే థియేటర్స్ లో విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ డీల్ కుదుర్చుకున్నారు. ఈ లెక్కన దేవర నవంబర్ 8న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా టాక్ నడుస్తోంది.