• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దొంగే అందర్నీ దొంగ అంటున్నాడు.. జ‌గ‌న్ పై టీడీపీ సెటైర్స్‌

admin by admin
October 14, 2024
in Andhra, Politics
0
0
SHARES
101
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో కూట‌మి స‌ర్కార్ అమ‌లు చేస్తున్న ఉచిత ఇసుక పాల‌సీపై మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఉచిత ఇసుక పాలసీ పేరుతో అవినీతి జరుగుతుందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేశార‌ని మండిప‌డ్డారు. అయితే జ‌గ‌న్ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ స్పందించింది. దొంగే అందర్నీ దొంగ అంటున్నాడంటూ జ‌గ‌న్ పై ఘాటుగా సెటైర్స్ పెల్చేసింది.

ఒక ఘరానా దొంగోడు, నేను దొరని అంటూ ప్రజలని మోసం చేస్తూ ఉండే వాడు. ఆ సైకో దొంగ బుద్ధి పసిగట్టిన ప్రజలు, ఆ దొంగని పట్టుకుని, ము* మీద నాలుగు పీకి బుద్ధి చెప్పి, ఊరు నుంచి తోలేశారు. ఆ ఘరానా దొంగ మళ్ళీ వేషం మార్చి, నేను చాలా అమాయకుడిని, ఇక్కడ ఉన్న వారు అందరూ దొంగలు అన్నాడు అంట. అవినీతి గురించి నువ్వు మాట్లాడితే అలాగే ఉంటుంది సైకో వైఎస్ జ‌గ‌న్‌.

ఇసుక గురించి, మద్యం గురించి, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే, నీకు అంత మంచిది సైకో జగన్. ఇప్పటికే నీ ఇసుక దోపిడీకి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యింది, విచారణ కూడా జరుగుతుంది. ఏ నిమిషం అయినా తాడేపల్లి కొంప దాకా వస్తుంది. ఇక మద్యం విషయంలో, తాడేపల్లి కొంపలో సాయంత్రం అయ్యేసరికి, నువ్వు డైరెక్ట్ గా ఎంత డబ్బులు వసూలు చేసే వాడివో, ఆ కేసు విచారణ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. నీ డబ్బు పిచ్చతో , ఎంతో మంది ప్రాణాలు తీసావ్, ఆ ఉసురు తగలకుండా ఉంటుందా.. కర్మ ఫలం అనుభవించాలి కదా.

రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? అని అడుగుతున్నావా ? నువ్వు ఉండే బెంగళూరులో లభించటం లేదేమో, మా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుకే లభిస్తుంది. ఒక పక్క ఉచిత ఇసుక లభిస్తుందా అని అడుగుతున్నావ్, మరో పక్క ఇసుక నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోయింది అంటున్నావ్. నీ స్క్రిప్ట్ రైటర్ ని బుర్ర వాడమని చెప్పు.

నీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఇసుక రెండింతలు అయ్యిందా ? నీ ప్రభుత్వంలో 20 టన్నుల లారీ రూ.30 నుంచి రూ.40 వేలకి అమ్మితే, మా ప్రభుత్వంలో రూ.16 వేల నుంచి రూ.18 వేలకు కేవలం రవాణా ఇతర చార్జీలతో వస్తుంది. ఇది రెండింతలు అవ్వటమా ? పేపర్లు కొట్టేసిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ?

వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా స్టాక్ యార్డుల్లో ఉంచావా ? మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే, అప్పుడే 80 లక్షల టన్నులు తీసి పెట్టావా ? నీ మొఖానికి అంత ముందు జాగ్రత్త ఏడిస్తే, ఈ రాష్ట్రం ఇప్పుడు ఇలా ఎందుకు ఉండేది ?

నీ ప్రభుత్వంలో అసలు ఇళ్లు కట్టుకోవాలని ఎవరికి ఉండేది ? నీ భారతీ సిమెంట్స్ కోసం సిమెంట్ బస్తాని రూ.450కి అమ్ముకున్న నీచుడువి నువ్వు, మర్చిపోయావా ? అప్పుడు రియల్ ఎస్టేట్ పడుకుంది. మా కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణాలు ఊపందుకున్నాయి. నువ్వు మా రాష్ట్రంలో ఉంటే కదా, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియటానికి.

ఇసుక విధానం గురించి, నువ్వే మాట్లాడాలి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి, వందల మంది ఆత్మహత్యకు కారణం అయిన సైకోవి నువ్వు. కేవలం నీ డబ్బు పిచ్చతో, అంత మందిని బలి తీసుకున్నావ్. పాలసీల గురించి, పరిపాలన గురించి నువ్వు మాట్లాడకు. నోటితో కాకుండా, ఇంకా దేంతోనే నవ్వుకోవాలి

నీ ప్రభుత్వంలో టన్ను రూ.475కే ఇచ్చావా ? ఎక్కడ ఇచ్చావ్ ? ఎవరికి ఇచ్చావ్ ? నీ దరిద్రపు మొఖంతో, వందల కోట్ల ప్రకటనలు ఇచ్చి, నువ్వు వదిలిన ప్రకటనలు మర్చిపోయావా ? టన్ను 800 నుంచి 1200 వందలు అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది నువ్వు కాదా ? దొంగ లెక్కలు రాసే, దొంగ బ్రతుకు కదా. ఇలాగే దొంగ లెక్కలు చెప్తావ్ అంటూ జ‌గ‌న్ పై టీడీపీ మండిప‌డింది. ఈ మేర‌కు అధికారిక ఎక్స్ లో జ‌గ‌న్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది.

Tags: Andhra PradeshAP Newsap politicsLatest newsTDPycpys jaganYS Jagan Mohan ReddyYSRCP
Previous Post

`దేవ‌ర‌` ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Next Post

తెలంగాణ విద్యార్థిని హత్య చేసినోడికి 60 ఏళ్లు జైలుశిక్ష

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Andhra

ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
jagan
Andhra

మాది రైతు రాజ్యం: జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌

June 14, 2025
Load More
Next Post

తెలంగాణ విద్యార్థిని హత్య చేసినోడికి 60 ఏళ్లు జైలుశిక్ష

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra