యంగ్ టైగర్ ఎన్టీఆర్ `దేవర` తో క్లీన్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేశారు. మెజారిటీ ఆడియెన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దేవర వీరవిహారం చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుని లాభాల బాట కూడా పట్టేసింది.
6వ రోజు అంటే అక్టోబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో దేవర ఏకంగా రూ. 9.33 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 14.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం రేపింది. దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు కాగా.. ఆరు రోజుల రన్ ముగిసే సమయానికి ఏపీ మరియు తెలంగాణలో రూ. 119.64 కోట్ల షేర్, రూ. 168.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే వరల్డ్ వైడ్ గా 6 డేస్ లో దేవర రూ. 194.04 కోట్ల షేర్, రూ. 332.20 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ ని దాటేసి 10 కోట్ల మేర ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.
ఇక దేవర క్లీన్ హిట్ గా నిలవడంతో.. సుమారు 23 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో కొనసాగుతున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ బద్దలైపోయింది. దర్శక దిగ్గజం రాజమౌళితో సినిమా చేస్తే చాలు లైఫ్ సెట్ అయినట్లే అని నటీనటులు అనుకుంటున్నారు. ఆయనతో సినిమా చేసిన హీరోలంతూ ప్రస్తుతం అగ్ర స్థానంలో సత్తా చాటుతున్నారు. కానీ రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయిన తన తరువాతి సినిమాతో బిగ్గెస్ట్ ఫాప్ ను మూటగట్టుకోవడం సెంటిమెంట్ గా వస్తోంది. సుమారు రెండున్నర దశాబ్దాల నుంచి ఈ సెంటిమెంట్ ను ఏ హీరో బ్రేక్ చేయలేకపోయాడు.
ఆఖరికి ఎన్టీఆర్ కూడా మూడు సార్లు ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బలయ్యారు. కానీ ఈసారి ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో మరో బిగ్ హిట్ ను అందుకుని ఫ్లాట్ సెంటిమెంట్ తో చిత్తు చేశాడు. తన మార్కెట్ ను మరింత భారీగా పెంచుకున్నాడు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.