ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ `కల్కి 2898 ఏడీ` జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మైథాలజీ అండ్ సైన్ ఫిక్షన్ యాక్షన్ చిత్రమిది. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన కల్కిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తే.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ వంటి తారలు అతిథి పాత్రల్లో కనిపించి అలరించారు.
పురణాలను భవిష్యత్తుకు ముడిపెడుతూ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే రూ. 900 కోట్లగా గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ప్రస్తుతం రూ. 1000 కోట్ల మార్క్ ను అందుకునేందుకు పరుగులు పెడుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కల్కి ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. కల్కి మూవీ తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషలకు చెందిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. హిందీ రైట్స్ ను దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సాలిడ్ ధరకు దక్కించుకుంది.
అయితే థియేటర్స్ లో విడుదలైన 7 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా కల్కి మేకర్స్ డీల్ కుదుర్చుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15న రెండు ఓటీటీల్లోనూ కల్కి సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, కల్కి మూవీకి పార్ట్ 2 రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ తో నాగ్ అశ్విన్ తొలి భాగాన్ని ముగించాడు. సినిమా ఆరంభం నుంచి బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై భారీగా అంచనాలు పెంచేశాడు.