‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో నాలుగు వారాల సమయమే మిగిలి ఉంది. దీని కోసం కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాదు… దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి మెగా మూవీస్ స్థాయిలో ఈ సినిమాకు ఇండియా వైడ్ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ చూస్తే మతి పోవడం ఖాయం.
హిందీ థియేట్రికల్ హక్కులు రూ.200 కోట్లు పైగా రేటు పలకగా.. రిలీజ్ కూడా రికార్డ్ స్థాయిలో ఉండబోతోంది. ఉత్తరాదిన కూడా ఈ చిత్రానికి తెల్లవారుజామునే స్పెషల్ షోలు పడబోతున్నాయి. ఈ క్రేజ్ చూశాక దానికి పోటీగా వేరే సినిమా రావడానికి భయపడాల్సిందే. దక్షిణాదిన అయితే ‘పుష్ప: రూల్’ఖు పోటీయే లేదు. కానీ బాలీవుడ్ నుంచి ధైర్యంగా ‘చవ్వా’ అనే సినిమాను పోటీలో నిలబెట్టారు.
విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘చవ్వా’ను డిసెంబరు 6న రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రానికి ఇప్పుడు థియేటర్ల సమస్య తలెత్తిందట. నార్త్ ఇండియాలో సింగిల్ స్క్రీన్లు దొరకడం కష్టమైందట. సింగిల్ స్క్రీన్లు అన్నీ ‘పుష్ప-2’కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. థయేటర్ల సమస్యకు తోడు ‘పుష్ప-2’ బరిలో ఉండగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే అని అర్థమై ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
జనవరి 10ని కొత్త డేట్‌గా ఎంచుకున్నారట. ‘చవ్వా’ను మొదట ‘పుష్ప-2’కు పోటీగా నిలబెట్టినపుడే తర్వాత వాయిదా సమాచారం వస్తుందనే అంచనా వేశారు ట్రేడ్ పండిట్లు. ఇప్పుడు అదే జరిగింది. ఒక సౌత్ మూవీకి భయపడి హిందీ సినిమాను వాయిదా వేయడాన్ని బట్టి బాలీవుడ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘పుష్ప-2’కు ఉన్న హైప్‌ను బట్టి చూస్తే హిందీ వెర్షన్ ఈజీగా ఐదొందట కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.