ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో మంచి జోష్ మీదున్న జనసేన పార్టీకి ఇప్పుడు రూరల్ ఓటు బ్యాంకు కూడా చేరువైంది. జనసేనకు స్థానికంగా బలం .. యువతే. ఇది పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. దీంతో గతంలో వచ్చిన ఓటు బ్యాంకు, ఇప్పుడు వచ్చిన ఓటు బ్యాంకు కూడా.. పట్టణస్థాయిలోనే కనిపిం చింది. జనసేన పోటీ చేసిన నియోజకవర్గాలను గమనించినా.. పట్టణ స్థాయిలోనే మెజారిటీ నియోజకవ ర్గాలు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాలు తీసుకోలేదు. పోటీ చేయలేదు. దీంతో జనసేన విజయం నల్లేరుపై నడకే అయింది. 21 నియోజకవర్గాలు కూడా.. పట్టణాల్లోనే ఉన్నాయి. ఒకటి రెండు తప్ప.. అన్నీ కూడా.. యువత ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నాయి. అయితే.. ఇప్పుడు గ్రామీణ స్థాయిలోనూ జనసేన పునాదులు బలంగా పడుతున్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో జనసేన బలంగా లేదన్న వారే.. ఇప్పుడు ఈ మాట చెబుతుండడం గమనార్హం.
దీనికి కారణం.. తాజాగా పవన్ చేసిన ఓ కీలక పని. గ్రామీణ ప్రాంతాలకు వెన్నుదన్ను వంటి.. పంచాయతీ లకు ఆయన తాజాగా 4 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇదేమీ చిన్న విషయం కాదు. దాదాపు 400 గ్రామ ప్రంచాయతీలకు రూ. లక్ష చొప్పున ఆయన ఇచ్చిన నిధులు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి లో పెద్ద సాయమేనని చెప్పాలి. వాస్తవానికి ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సొమ్ములు.. పులుసులో కలిసిపోతు న్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా.. పంచాయతీలకు నిధులు ఇవ్వడం గగనంగా మారిపోయింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక్కటే కీలకంగా మారి అమలవుతున్న నేపథ్యంలో ఇతర పనులకు ప్రభు త్వాలు నిధులు ఇవ్వడం లేదు.దీంతో అనేక పంచాయతీలు.. విద్యుత్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ చేసిన సాయం.. పంచాయతీలకు ఆర్థికంగా వెన్నుదన్ను అయింది. ఇది అక్కడితో అయిపోలేదు.. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో పవన్ గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు లేని కళ పంచాయతీలకు రావడం వెనుక పవన్ ఉన్నారనే అంటున్నారు. ఈ రిజల్ట్.. ఆయన పార్టీకి.. ఓటు బ్యాంకును పెంచుకునేందుకు దోహదపడనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.