బ్రాహ్మణ సోదరులకు బహిరంగ లేఖ
గౌరవనీయులైన బ్రాహ్మణ సోదర,సోదరీమణులకు నమస్కారాలతో,
వైసిపి అరాచకాలకు బుద్ది చెప్పేందుకు ఇదొక మంచి అవకాశం
ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలను నిలిపివేశారు
రాష్ట్రవ్యాప్తంగా 180 దేవాలయాలపై దాడులు చేశారు
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ఓంకార దేవస్థానంలో పురోహితుడు సుధాకరయ్యపై చర్నకోలతో దాడిచేశారు
కరోన సమయంలో బ్రాహ్మణులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు
కోవిద్ బారిన పడి ప్రభుత్వ సాయం అందక ఎంతోమంది బ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు
తిరుపతి ఎన్నికల్లో వైసిపికి ఓటుతో బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది
తెలుగుదేశం పార్టీకి అండగా నిలచి వైసిపి ప్రభుత్వానికి బ్రాహ్మణులు అండగా నిలవాలి
రాష్ట్రంలో ఈనెల 17వ తేదీన జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బ్రాహ్మణులు ఆలోచించి ఓటు వేయాలి. గత రెండేళ్లలో వైసిపి ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణులు ఎదుర్కొన్న అవమానాలు, అణచివేత చర్యలకు బుద్ది చెప్పేందుకు ఇదొక మంచి అవకాశం. వైసిపి ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. మారుమూల ఆలయాల్లో ధూపదీప నైవేధ్యాలను నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా 180 ఆలయాలపై దాడులు జరిగినప్పటికీ ఒక్క కేసును కూడా చేధించలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార దేవస్థానం పూజారి సుధాకరయ్య, ఆయన కుమారులు చక్రపాణి, మృగపాణిలపై వైకాపా నాయకుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు పిట్టం ప్రతాపరెడ్డి చర్నాకోలతో దాడికి దిగారు. ఆయన నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పూజారులు ఆలయంలోపలకు వెళ్లి తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన యావత్ బ్రాహ్మణ లోకం మనసులను గాయపర్చింది. ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చిన వేలాది ఎకరాల భూములను కొందరు వైసిపి నాయకులు అన్యాక్రాంతం చేశారు. చివరికి దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకన్న భూములను తెగనమ్మాలని ప్రయత్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యకు కోట్లాదిరూపాయలు వెచ్చించి వందలాది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూతనందించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ను క్రియాశీలకంగా తయారుచేసి జీవనశైలిలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించాం. ప్రస్తుతం పరిస్థతులు పూర్తి దుర్బరంగా తయారయ్యాయి. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని పాడుబెట్టి బ్రాహ్మణులకు అన్యాయం చేసింది. కరోనా విపత్తు సమయంలో పేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
బ్రాహ్మణుల్లో దాదాపు 30శాతం పౌరోహిత్యంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కరోనా సమయంలో పౌరోహిత్యానికి ఎవరూ పిలవని రోజున కుటుంబ సభ్యులంతా పస్తులు ఉండాల్సిన దుర్బర పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో బ్రాహ్మణుల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాదాపు 12సంవత్సరాలపాటు వేద విద్యను అభ్యసించిన పురోహితులకు వివిధ ప్రముఖ ఆలయాల్లో ఇచ్చే జీతం ప్రభుత్వ కార్యాలయాల్లో 4వ తరగతి ఉద్యోగులకన్నా తక్కువ ఉంది. చాలీచాలని గౌరవ వేతనాలతో అర్చక వృత్తితో జీవనం సాగిస్తున్న చాలామంది పురోహితులు ఆలయాలకు తాళాలు వేసి ఊళ్లకు దూరంగా వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ సాయం అందక కోవిద్ బారిన పడిన ఎంతోమంది బ్రాహ్మణులు వైద్య సదుపాయాలు అందక మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం నుండి సరైన ఆర్థిక ఆలంబన లేక 50శాతం మంది పేద బ్రాహ్మణ విద్యార్థులు పదోతరగతితోనే చదువును ఆపేస్తున్నారు. బ్రాహ్మణులపై చిన్నచూపు చూస్తున్న వైసిపి ప్రభుత్వానికి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్దచెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. చైతన్యానికి మారుపేరైన బ్రాహ్మణులు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలచి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసిపి ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఝప్తి చేస్తున్నాను.
ఇట్లు,
మీ విధేయుడు
బుచ్చి రాంప్రసాద్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి