Not china or pak border ????????♂️ This is duggirala town , mangalagiri , Andhra Pradesh. Just for loosing in Zptc ????????
This is how scared the aP govt is or common people. #APjaaduCM pic.twitter.com/zjXizcCMOV— chay (@DirChay) September 23, 2021
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో వైసీపీ ప్లాన్ ఏంటి? ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి వ్యూహం ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. ఎందు కంటే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిషత్ ఎన్నికల్లో మంచి పట్టు సాధించింది.
జిల్లా పరిషత్‌లు మొత్తాన్ని కూడా వైసీపీ గుండుగుత్తుగా తన ఖాతాలో వేసుకుంది. అదేవిధంగా వేలాది మండల పరిషత్‌లను కూడా తన వైపు తిప్పుకొంది. అయితే..చిత్రంగా కొన్ని చోట్ల టీడీపీ పుంజుకుంది. అదేవిధంగా జనసేనకు కూడా ప్రజలు బాగానే స్థానాలు ఇచ్చారు.
వాస్తవానికి టీడీపీ బహిష్కరించినప్పటికీ.. అక్కడ.. పోటీ చేసిన అభ్యర్థులను మాత్రం ప్రజలు గెలిపించా రు. ఇలా.. టీడీపీ పుంజుకున్న మండలాల్లో.. దుగ్గిరాల ఒకటి. ఇక్కడ మొత్తం 18 ఎంపీటీసీ స్థానాల్లో ఏకంగా 9 స్థానాలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.
దీంతో ఇక్కడ టీడీపీ ఎంపీపీ అధ్యక్ష స్థానాన్ని దక్కించుకుంటే.. ఉపాధ్యక్ష స్థానం కూడా దానికే తక్కుతుంది. మెజారిటీ మేరకు అలానే జరగాలి. కానీ, ఇది వైసీపీ కీలక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కావడంతో.. ఇక్కడ ఆయన హవానే నడుస్తోంది.
దీంతో టీడీపీ నిర్ణయించిన బీసీ-ఈ సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీ అధ్యక్ష పదవి అభ్యర్థినికి కుల ధ్రువీకరణ పత్రం అందకుండా చక్రం తిప్పారు.టీడీపీని అడ్డుకోవడంతో రామకృష్ణారెడ్డి వేసిన తొలి అడుగు ఇది. నిజానికి రాత్రి పొద్దుపోయినా.. అవసరమైతే.. తెల్లవార్లూ పనిచేసైనా.. తహసీల్దార్లు.. ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు అవసరమైన పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ స్వయంగా చెప్పారు.కానీ, ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థికి ఈ నియమం పాటించలేదు. ఇప్పటి వరకు కుల ద్రువీకరణ పత్రం ఇవ్వలేదు.
పోనీ.. వైసీపీకి మెజారిటీ ఉందా? అంటే కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక, ఒకస్థానం జనసేన తరఫున ఒకరు దక్కించుకున్నా.. వారు వైసీపీ వైపు మొగ్గు చూపడం లేదు. దీంతో ఇక్కడ రెండు రోజులుగా.. ఎంపీపీ ఎన్నిక విషయం తర్జన భర్జన గా సాగుతోంది.
శుక్రవారం మధ్యాహ్నం 3గంటల వరకు ఎంపీపీ ఎన్నిక సాగలేదు. ఇక, శనివారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. మరొక్క రోజు అంటే.. ఆదివారం వరకు గడువు ఉంది. ఈలోగా ఎంపీపీ ఎన్నిక జరగకపోతే.. టెక్నికల్‌గా ఇక్కడ ఎన్నికలు రద్దయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడు ఆళ్ల ఈ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఇక్కడ ఎన్నికను రద్దు చేసి.. మళ్లీల ఎన్నికలకు వెళ్లి.. టీడీపీ విజయాన్ని నాశనం చేయాలని ముఖ్యంగా ప్రజాతీర్పును ఆయన సమాధి చేయాలని భావిస్తున్నారా? అనే విమర్శలు జోరందుకున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
గుంటూరు జిల్లా దుగ్గిరాల లో మా ఎంపీపీ అభ్యర్థి షేక్. జమీన్ గారికి కులదృవీకరణ పత్రం ఇవ్వకుండా MRO గారు ఇబ్బందిలకు గురి చేస్తున్నారు.ఈ విషయమై గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారిని కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. pic.twitter.com/pPhtL4WFDs
— Nakka Ananda Babu (@NakkaAnandababu) September 23, 2021
దుగ్గిరాలలో యుద్ధ వాతావరణం. ఎలాగైనా ఎం.పి.పి దక్కించుకోవాలని వైసీపీ యత్నం.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో, దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలలో 5 స్థానాలలో మాత్రమే వైసీపీ అభ్యర్థుల నిజమైన గెలుపు. (1/3) pic.twitter.com/8YqNcOimo8— Telugu Desam Party (@JaiTDP) September 23, 2021