ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు అహర్నిశలు పాటుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ తో ఏపీలో పెట్టుబడులను చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ఏపీలో మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు కీలక నిర్ణయం తీసున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల కోసం ఒకేసారి 6 కొత్త పాలసీలు తీసుకువచ్చామని ఆయన అన్నారు. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ 6 కొత్త పాలసీలను ఆమోదించామని తెలిపారు.
థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనేది తమ ప్రభుత్వ నినాదమని చంద్రబాబు తెలిపారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త ఉండడమే తమ విజన్ అని, ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇదే చెప్పామన్నారు. పెట్టుబడులు తీసుకువస్తాం… అభివృద్ధి చేస్తాం… సంపద పెంచుతాం… పెంచిన ఆదాయం పేదలకు సంక్షేమ రూపంలో అందిస్తాం అని అన్నారు.తమ విజన్ స్వర్ణాంధ్ర-2047 అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువగా ఇండస్ట్రియల్ పార్కులు ఉండేలా చూస్తామన్నారు.
1. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ
2. ఏపీ ఎంఎస్ఎంఈ, ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ పాలసీ
3. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
4. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ
5. ఏపీ ప్రైవేటు పార్కుల పాలసీ
6. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ