ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నా వైసీపీ నాయకులకు బుద్ధి రావడం లేదు. స్థాయిని మరచి వికృత చేష్టాలకు పాల్పడుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఓ వైసీపీ నాయకుడు నడిరోడ్డుపై చేసిన పాడు పని ఆలస్యంగా బయటకు వచ్చింది. సెప్టెంబర్ 2న ఆగిరిపల్లి సెంటర్లో అర్ధరాత్రి మద్యం సేవించి ఫార్చునర్ కారులో వెళ్తున్న వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హార్ష.. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన స్థానిక జనసేన నాయకుని కారుపై ఉన్న పార్టీ జెండాపై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందాడు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన జనసేన పార్టీ జెండాను అత్యంత ఘోరంగా అవమనించాడు. అది కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. అభిమానులు, జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ హార్ష జనసేన జెండాపై మూత్రం పోసిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.
దాంతో సదరు స్థానిక జనసేన నాయకుడు సాక్ష్యాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ జెండాను ఘోరంగా అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అదే సమయంలో కొందరు కూటమి నాయకులు నిందుతుడిని కాపాడేందుకు రాజీ చర్చలకు దిగడంతో.. పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మూకుమ్మడి ఫిర్యాదుల కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.