ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేతన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ జైలుకు పంపడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ స్కెచ్ వేశారంటూ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నాలుగు రోజుల క్రితం పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలిసారి పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారు.
ఆ సమావేశంలో ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశం, పెండింగ్ ప్రాజెక్ట్స్ మరియు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కెబినెట్ సమావేశం ముగిసిన వెంటనే హడావుడిగా పవన్ ఢిల్లీ బయల్దేరి వెళ్లింది ఇందుకేనా అంటే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నుంచి కాదనే సమాధానం వినిపిస్తోంది. మాజీ సీఎం జగన్ ను జైలుకు పంపడానికి పవన్ ఢిల్లీలో చక్రం తిప్పారని.. అమిత్ షాతో భేటీ వెనుక ఎజెండా అదే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జగన్ ఆస్తుల తగాదాలో సరస్వతీ పవర్ భూముల వ్యవహారం తెరపైకి రావడంతో.. పవన్ వాటిపై ఫోకస్ పెట్టారు. సరస్వతి పవర్ భూముల సేకరణలో పెద్దఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని గుర్తించారు. ప్రజల ఆస్తులను అడ్డగోలుగా దోచేసి తమ సొంత ఆస్తిలా జగన్ కుటుంబసభ్యులు కొట్టుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. సరస్వతి పవర్ భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపిస్తామని.. భూములు కోల్పోయిన రైతులకు అండంగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు.
ఇక ఇదే అంశాన్ని డిపెండ్ చేసుకుని జగన్ బెయిల్ రద్దుకు అమిత్ షా వద్ద పవన్ పావులు కదిపినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. సీబీఐ కేసుల్లో విచారణ వేగవంతం చేసి జగన్ ను జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం పెద్దలతో పవన్ చర్చించారని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగి జగన్ జైలు పాలైతే.. ఇప్పటికే బిక్కు బిక్కమంటున్న వైసీపీకి పెద్ద దిక్కు కరువుతుంది.