ఏపీ సీఎం జగన్పై వరుస పెట్టి బాంబులు పేల్చుతున్న ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వివేకానందరెడ్డి హత్య, హంతకుల విషయంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన షర్మిల.. తాజాగా కీలకమైన అంశంపై మరో బాంబు పేల్చారు. పిడుగురాళ్లలో వైసీపీ అధినేత నిర్వహించిన `మేం సైతం సిద్ధం` ఎన్నికల ప్రచార సభలో “జాబు రావాలంటే.. ఏ బాబు రావాలో మీరే తేల్చుకోండి!“ అని వ్యాఖ్యానించారు.
అయితే.. దీనిపై టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎలాంటి కౌంటర్లు ఇవ్వలేదు. కానీ, షర్మిల మాత్రం దుమ్మెత్తి పోశారు. ఈ ప్రకటనను ఆమె ఘరానా మోసంగా అభివర్ణించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పాడో గుర్తుచేసుకోవాలంటూ.. అప్పటి వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన విషయాన్ని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి.. గద్దెనెక్కిన తర్వాత.. ఏ ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా? అని నిలదీశారు.
ఇదేసమయంలో జనవరి 1న ఠంచనుగా జాబ్ క్యాలెండరు ఇస్తామన్న జగన్.. ఇచ్చారా? అని షర్మిల నిలదీశారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు జాబులు ఇస్తామని మధ్య పెట్టి యువతను మోసం చేశారని షర్మిల విమర్శించారు. “మోసానికే బ్రాండ్ అంబాసడర్ జగన్“ అని షర్మిల నిప్పులు చెరిగారు. 2 లక్షల వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న జగన్.. ఇవి గౌరవప్రదమైన ఉద్యోగాలో కాదో చెప్పాలని ప్రశ్నించారు.
వలంటీర్ ఉద్యోగాలకు భద్రత ఉందా? ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే రూల్స్ వీరికి కూడా వర్తిస్తాయా? అని నిలదీశారు. అలాంటప్పుడు.. జగన్ చేసింది ఏంటి? అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఉన్న ఉద్యోగాలు అన్నింటినీ తొలి సంవత్సరంలోనే పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నట్టు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ వస్తే.. ప్రత్యేక హోదా వస్తుందని తద్వారా ఉపాధి మెరుగు పడుతుందని అన్నారు.
అవినాష్ రెడ్డీ వద్దు షర్మిల రెడ్డీ వద్దు
కడపలో హత్యా రాజకీయాలు పోవాలి అంటే టీడీపీనే గెలవాలి
– కడప జిల్లా సామాన్య ఓటరు pic.twitter.com/utwvBaUeYg
— TDP Germany (@TDP_Germany) April 11, 2024