ఏపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీని పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, ఆదానీ చేతిలో పెట్టేందుకు జగన్ సర్కార్ సన్నాహాకాలు చేస్తోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని రిలయన్స్ అధినేత మఖేష్ అంబానీ చేతికి అప్పగించాలని చూస్తున్నారు. అంబానీ కంపెనీకి చెందిన జియో సంస్థకు టీటీడీ దర్శనం టికెట్ల వెబ్‌సైట్‌ను అప్పగిస్తున్నారు. శ్రీవారి దర్శనం టికెట్‌కు టీటీడీ వెబ్‌సైట్‌కి లాగిన్ అయితే జియోమార్ట్‌కు టీటీడీ సైట్ రీడైరెక్ట్ అవుతోంది. దీంతో శ్రీవారి భక్తులు గందరగోళానికి గురవుతున్నారు.
దర్శనాలకు తాము చెల్లించే డబ్బు టీటీడీకి పోతుందా, జియో మార్ట్‌కు పోతుందా అని భక్తుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం టికెట్ జియో ఇస్తోందా..? టీటీడీ ఇస్తుందా..? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆ టికెట్లు చెల్లుబాటు అవుతాయా.. లేదా.. అంటూ భక్తుల సందేహియిస్తారు. సందేహాల నివృత్తిని పట్టించుకోని టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో వెబ్సైట్లో జియో మార్ట్ అనే లోగో కనిపించడంతో భక్తులు షాక్‌కు గురవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.
ఇదే విషయంపై టీటీడీ అధికారులను ప్రశ్నిస్తే.. టీటీడీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా జీయోతో ఒప్పందం చేసుకున్నట్లు టీటీడీ చెబుతోంది. జియో సంస్థ టీటీడీకి ఉచితంగా సేవలందిస్తోందని చెప్పడం గమనార్హం. భక్తులు ఆన్లైన్లో సులభంగా టికెట్లు పొందవచ్చని, దాదాపు రెండు లక్షలకు పైగా టికెట్లను భక్తులు ఇప్పటికే కొనుగోలు చేశారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వెబ్సైట్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
కరోనా ఫస్ట్, సెకెండ్ లాక్డౌన్ వల్ల తిరుమలకు భక్తుల రాకపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కరోనా తగ్గముఖం పట్టడంతో శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. కరోనా నియమాల ప్రకారం తిరుమలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రతి నెలకు శ్రీవారి సర్వదర్శన టికెట్లను ఒకేసారి ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తోంది. గతంలో ఈ బాధ్యతలను టీసీఎస్ అనే సంస్థ నిర్వర్తిస్తూ ఉండేది. టికెట్ల కోసం భక్తులు భారీగా ఎగబడుతుండడంతో కొద్ది నెలలుగా సర్వర్లు మొరాయిస్తున్నాయి.
ఈ క్రమంలో అమెజాన్ సంస్థతో కూడా దీనిపై మాట్లాడటం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో జియోను సంప్రదించినట్లు టీటీడీ చెబుతోంది. సాఫ్ట్వేర్ లోపాల కారణంగానే జియోకు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఇదే విషయంపై ముఖేష్ అంబానీ సన్నిహితులతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జియోకు తిరుమల టికెట్ల బాధ్యతలు ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్పుడు అప్పగించారనే విషయంలో వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనివ్వడంలేదు. అయితే జియోకు తిరుమల టికెట్ల బాధ్యతలు ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఈరోజు ఉదయం కూడా టికెట్ల రద్దీతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా నిలిపేశారు. ఏపీ అంబానీ, ఆదానీ పరమైపోతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. 2.31 లక్షల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు. కేవలం రెండున్నర గంటల్లో 2.31 లక్షలు టికెట్ల విక్రయించారు. టికెట్ల బుకింగ్‌లో జియో మార్ట్‌కు రీడైరెక్ట్ అవుతావుండడంతో సమస్య పరిష్కారానికి టీటీడీ చర్యలు తీసుకుంటున్నారు. రేపు సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసేలోపు సమస్యను పరిష్కరిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.