చెన్నై సోయగం త్రిష సోషల్ మీడియాలో నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇతరులపై బురద జల్లడమే మీ పనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు. గురువారం అజిత్, త్రిష జంటగా నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ వైల్డ్ యాక్షన్ డ్రామాకు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే ఈ సినిమా విషయంలో త్రిష వ్యక్తిగత జీవితాన్ని లాగి కొందరూ తప్పుడు పోస్ట్‌లు పెట్టారు.
అలాగే కొందరు గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష యాక్టింగ్ ఏమాత్రం బాగోలేదని.. తమిళం తెలిసినప్పటికీ ఆమె పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఏంటని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష పిచ్చి పిచ్చి పోస్ట్‌లతో నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్న వారిని ఉద్ధేశిస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. `విషపూరితమైన వ్యక్తులు.. అసలు మీరెలా జీవిస్తున్నారు.. ప్రశాంతంగా మీరు ఎలా నిద్ర పోతున్నారు.. ఖాళీగా కూర్చొని ఇతరులపై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి రాక్షసానందం పొందడమే మీ పనా?
ఇతరుల గురించి నీచమైన పోస్టులు పెట్టే మీతో మీ పక్కనున్న వారికి కూడా చాలా ప్రమాదం. మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా` అంటూ త్రిష పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. కాగా, త్రిష సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవికి జోడిగా `విశ్వంభర` చిత్రంలో యాక్ట్ చేస్తోంది. అలాగే కోలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్‌లు టేకప్ చేసింది.